Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో 10వేలకు చేరువలో కరోనా కేసులు.. 308మంది మృతి

సోమవారం ఉదయానికి దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 9152కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 857 మంది కోలుకోగా... దాదాపు 7987మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
India’s corona tally reaches 9,152, death toll is 308
Author
Hyderabad, First Published Apr 13, 2020, 11:30 AM IST
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సోకినవారి సంఖ్య దేశంలో 10వేలకు చేరువలో ఉంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఈ వైరస్  సోకి 35మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Also Read లాక్ డౌన్ పొడిగింపు: ప్రభుత్వ రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల ఫార్ములా ఇదే!...

సోమవారం ఉదయానికి దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 9152కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 857 మంది కోలుకోగా... దాదాపు 7987మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ కేసుల్లో సగానికి సగం మహారాష్ట్రలో చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు కరోనా హాట్ స్పాట్ లు మహారాష్ట్ర,ఢిల్లీ నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. ఢిల్లీలో 1069 కరోనా కేసులు,19మరణాలు నమోదవగా,మహారాష్ట్రలో 1761 కరోనా కేసులు,127 మరణాలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ 400లకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇక గత నెల భారత ప్రధాని ప్రకటించిన 21రోజల లాక్ డౌన్ తో మంగళవారం(ఏప్రిల్-14,2020)తో ముగియనుంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇప్పటివరకు చేసినదంతా వృద్ధా అవుతుందని శనివారం ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీకి తెలియజేశారు. ప్రధాని కూడా లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. దీంతో ఏప్రిల్-30వరకు లాక్ డౌన్ పొడించే ప్రకటన ఇవాళ అధికారికంగా వెలువడనుంది.
Follow Us:
Download App:
  • android
  • ios