Indo-China Relations: డ్రాగన్ కంట్రీ తన వక్రబుద్ది మరోసారి బయటపెట్టింది. దక్షిణాఫ్రికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ల సమావేశం తర్వాత చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ లను తన భూభాగాలుగా చూపించింది. అయితే, చైనా 2023 స్టాండర్డ్ మ్యాప్ పై భారత్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Controversial China Map: డ్రాగన్ తన వక్రబుద్ది మరోసారి బయటపెట్టింది. దక్షిణాఫ్రికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ల సమావేశం తర్వాత చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ లను తన భూభాగాలుగా చూపించింది. అయితే, చైనా 2023 స్టాండర్డ్ మ్యాప్ పై భారత్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాల్లోకెళ్తే.. భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య ఇటీవలి కాలంలో మరింత ఉద్రిక్తలకు దారితీసింది. భారత భూభాగాలను చైనా ఆక్రమిస్తోందన్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఖండించింది. అయితే చైనా దురాక్రమణ కారణంగా లఢక్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శిస్తూ.. భారత్ భూభాగాలను తనవిగా చూపిస్తూ కొత్త చైనా మ్యాపును విడుదల చేసింది.
చైనా 'స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ 2023 విడుదల చేసింది. అందులో అరుణాచల్ ప్రదేశ్, మొత్తం అక్సాయ్ చిన్ ప్రాంతం చైనా భూభాగంలో ఉండేలా డిజైన్ చేసింది. అలాగే, చైనా నుంచి ప్రత్యేక దేశమైన తైవాన్‌ను, దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాలను చైనా తన భూభాగంగా ప్రకటించింది. గత ఏప్రిల్‌లో చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు 'సౌత్ టిబెట్'గా పేరు మార్చింది. దీని తరువాత, చైనా కూడా భారతదేశ భూభాగాలను కలిగి ఉన్న కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. దీన్ని చాలా మంది ఖండిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జీ20 సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో చైనా స్టాటిక్ మ్యాప్ షాక్‌కు గురి చేసింది.
చైనా 'స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ 2023'పై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. చైనాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ లను పేర్కొంటూ బీజింగ్ మ్యాప్ ను విడుదల చేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. చైనా ఇలాంటి చర్య సరిహద్దు సమస్యను మరింత జటిలం చేస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
చైనా 2023 స్టాండర్డ్ మ్యాప్ ను దౌత్య మార్గాల ద్వారా వ్యతిరేకించామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారత భూభాగాన్ని తమదిగా చైనా వాదించడం అన్యాయమైన వాదన అని ఆయన అన్నారు. ఈ డిమాండ్లను తాము తిరస్కరిస్తున్నామని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఎందుకంటే వాటికి ఆధారం లేదు. చైనా వైపు నుంచి ఇలాంటి వాదన సరిహద్దు సమస్య పరిష్కారాన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది. చైనా వాదనలు అన్యాయమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
