‘ రాజీవ్ గాంధీని హత్య చేసినట్టే.. మోదీని కూడా..’

Maoists Were Plotting To Assassinate PM Modi, Pune Police Tell Court
Highlights


మోదీ హత్య చేసేందుకు మావోయిస్టుల కుట్ర..?

ప్రధాని నరేంద్రమోదీ హత్యకు ఎవరైనా కుట్ర పన్నుతున్నారా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. అవుననే సమాధానమే వినపడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేసేందుకు ప్రయత్నాలు  చేస్తున్న ఐదుగురిని పుణే పోలీసులు పట్టుకున్నారు. 

వారికి మవోయిస్టు పార్టీతో సంబధాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.. కాగా.. పోలీసులు  అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి నివాసంలో దొరికిన ఓ లేఖ ఇప్పడు సంచలనంగా మారింది.  ఆ లేఖలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య చేసినట్టు , నరేంద్ర మోదీని హత్య చేయాలని మవోయిస్టులు పథకం పన్నారని పోలీసులు తెలిపారు.

నిందితులు ముంబైకి చెందిన సుధీర్ ధవాలే, ఢిల్లీకి చెందిన రోనా జాకబ్, నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సురేంద్ర గండ్లింగ్, షోమా సేన్, మహేష్ రావత్‌లు వున్నారు. నిందితుల్లో రోనాజాకబ్ ఇంట్లో ఆ లేఖ దొరికిందని ప్రాసిక్యూటర్ ఉజ్వల్ పవార్ పుణే కోర్టులో  తెలిపారు. 

ఆ లేఖలో ఎం 4 రైఫిల్ ,నాలుగు లక్షల రౌండ్లకు అవసరమైన బుల్లెట్లను కోనుగోలు చేసేందుకు, రూ. 8 కోట్లు అవసరమని ఉందని, అలాగే ఆ లేఖలో మరో రాజీవ్ గాంధీ హత్య (మోదీ పేరు ప్రస్తావించలేదు) గురించి ప్రస్తావన ఉందని కోర్టుకు నివేదించారు. నిందితుల తరుపున న్యాయవాది ,ప్రాసిక్యూషన్ వాదనలతో ప్రవేశపెట్టిన పత్రాలన్నీ ఆవాస్తవాలని వాదించాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఈ నెల 14 వరకు నిందితులను పోలీసు కస్టడీలో ఉంచాల్సిందిగా ఆదేశించింది

కాగా.. ఇది చాలా సీరియస్ విషయమని.. నక్సల్స్ హస్తం కూడా ఉండే ఉంటుందని బీజేపీ నేత నలీన్ కోహ్లీ అభిప్రాయపడ్డారు.  ఇదే విషయంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది వారి పని వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు.

loader