Asianet News TeluguAsianet News Telugu

‘భారత్ జోడో యాత్ర’ కు మావోయిస్టుల బెదిరింపు సెగ.. రూట్ మ్యాప్ నుంచి ఛత్తీస్ ఘడ్ ను తప్పించిన కాంగ్రెస్..

మవోయిస్టుల బెదిరింపు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర నుంచి చత్తీస్ ఘడ్ ను తప్పించింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని అక్కడ పాదయాత్ర కూడా అవసరం లేదని పేర్కొంది. 

Maoists threat to 'Bharat Jodo Yatra' continued.. Congress left Chhattisgarh from the route map..
Author
First Published Aug 24, 2022, 1:29 PM IST

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కు మావోయిస్టు బెదిరింపు సెగ తగిలింది. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతం అయిన ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ యాత్ర‌ను ఆ రాష్ట్ర నాయ‌క‌త్వం త‌ప్పించింది. చట్టవిరుద్ధమైన సీపీఐ (మావోయిస్ట్) ఉనికి కారణంగా భద్రతాపరమైన ముప్పు ఉందని భావించిన పార్టీ సీనియర్ నాయకులు ఛత్తీస్‌గఢ్‌ను యాత్రకు దూరంగా ఉంచాల‌ని నిర్ణ‌యించారు. 

‘‘యాత్ర సమయంలో అధిక ప్రాంతం, రాష్ట్రాలను కవర్ చేయడానికి వివిధ మార్గాలను, అందుబాటులో ఉన్న ఎంపికలను సమీక్షిస్తూ ఈవెంట్ ప్రణాళిక బృందం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. స్పష్టమైన భద్రతా కారణంతో పాటు, కాంగ్రెస్ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో బలమైన స్థితిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌క‌పోతే ఎలాంటి ప్ర‌మాదమూ లేదు’’ అని ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెప్పార‌ని ‘ది న్యూ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.

From the IAF vault: భారత వైమానిక దళ పరాక్రమ పైలట్లు.. పాక్ జెట్లు పేల్చిన ధీరులు
 
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ఈ భార‌త్ జోడో యాత్ర ప్రారంభ‌మ‌వుతుంది. ఇది కాశ్మీర్‌లో జనవరి 30న ముగుస్తుంది. ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను క‌వ‌ర్ చేయ‌నుంది. ‘‘ఢిల్లీలో దాదాపు 150 పౌర సమాజ సంస్థలతో రాహుల్ గాంధీ ప్రోత్సాహకరమైన పరస్పర చర్య తర్వాత, యాత్రలో అనేక మంది తమ ప్రతినిధులు, ఇత‌ర వ్య‌క్తులు దేశవ్యాప్తంగా మార్చ్‌లో చేరాలని పార్టీ భావిస్తోంది’’ అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

భోపాల్‌లో సోమవారం జరిగిన సెంట్రల్ జోనల్ కౌన్సిల్ 23వ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మోదీ హయాంలో మావోయిస్టుల హింసాకాండ గణనీయంగా తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో హింస తగ్గుముఖం పట్టినప్పటికీ మావోయిస్ట్‌లు ఇప్పటికీ బలమైన ఉనికిని కలిగి ఉన్నారనే నమ్మకాన్ని రాజకీయ స్పెక్ట్రం అంతటా ఉన్న నాయకులు స్పష్టంగా పెంచుకున్నారు. 25 మే 2013న బస్తర్‌లోని సంఘర్షణ ప్రాంతంలోని జీరామ్‌లో పార్టీ పరివర్తన్ యాత్ర సందర్భంగా మావోయిస్టుల దాడి రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని తొలగించింది. ఈ సంఘటన దేశంలోనే అతిపెద్ద రాజకీయ హత్యగా పేర్కొన్నారు. ఈ దాడిలో దాదాపు 28 మంది పార్టీ నేతలు చనిపోయారు.

బీహార్ ఫ్లోర్ టెస్ట్‌కు ముందే స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా..

ఇదిలా ఉండ‌గా.. ‘భారత్ జోడో యాత్ర’ క‌ర్ణాట‌క‌లో హింసకు దారితీసే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప మంగ‌ళ‌వారం అన్నారు. ఒక వేళ యాత్రలో హింసాత్మక ఘటనలు జరిగితే దానికి పూర్తిగా సిద్ధరామయ్యనే బాధ్యుడు అవుతాడని ఆయన హెచ్చరించారు. ఈ మేర‌కు ఆయ‌న నిన్న మీడియాతో మాట్లాడారు. నిరసనల సాకుతో పాదయాత్ర చేయడం తగదని, కాంగ్రెస్‌ అధినేత సిద్ధరామయ్య సంయమనం పాటించాలని య‌డియూర‌ప్ప అన్నారు. ప్రతిపాదిత పాదయాత్ర జరిగితే లక్షలాది మంది జనం గుమికూడే అవకాశం ఉందని చెప్పారు. అది విపత్తును తలపిస్తుందని, దీనికి సిద్ధరామయ్య పూర్తిగా బాధ్యత వహించాలని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios