హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ ఇక లేరు..
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కేరీర్ ను కొనసాగించారు. అజీమ్ అంత్యక్రియలు నేడు జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
హైదరాబాద్ కు చెందిన మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) చనిపోయారు. గత కొంత కాలంగా ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. దీని కోసం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మంగళవారం ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. అబ్దుల్ అజీమ్ దేశవాళీ క్రికెట్ లో 80, 90 దశకాల్లో మంచి ఓపెన్ గా పేరు పొందారు.
నారాయణపేటలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి.. వారిని కాపాడేందుకు వెళ్లిన మహిళ కూడా..
దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడే అజీమ్ 1986 రంజీ సీజన్‌లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచారీ కొట్టారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కేరీర్ ను ఆయన కొనసాగించారు. మొత్తం 73 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. తన కెరీర్ మొత్తంలో 4644 పరుగులు తీశారు. కొంత కాలం పాటు కోచ్ కూడా పనిచేశారు. అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సెలెక్టర్ గా కూడా విధులు నిర్వర్తించాడు. అబ్దుల్ అజీమ్‌కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.