అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను దారుణంగా హత్య చేసి ఏజెన్సీలో కలకలం రేపిన మావోయిస్టులు తాజాగా ఛత్తీస్‌గఢ్‌పై పంజా విసిరారు..

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను దారుణంగా హత్య చేసి ఏజెన్సీలో కలకలం రేపిన మావోయిస్టులు తాజాగా ఛత్తీస్‌గఢ్‌పై పంజా విసిరారు.. బీజాపూర్‌ అడవుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్‌పై ఈ తెల్లవారుజామున మెరుపుదాడికి దిగారు..

తుపాకులు, గ్రనేడ్లతో అన్ని వైపుల నుంచి విరుచుకుపడ్డారు. అయితే వెంటనే తేరుకున్న సైనికులు ఈ దాడిని తిప్పికొట్టారు. సుమారు గంటపాటు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

మావోల ఏరివేతలో భాగంగా ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్ భద్రతా దళాలు ఇక్కడి నుంచే కూంబింగ్ కార్యకలాపాలు చేస్తున్నాయి. మరోవైపు దాడి అనంతరం మావోలు అడవుల్లోకి పారిపోయారు... అదనపు బలగాలను రంగంలోకి దించి.. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు