మున్ముందు అనేక వేవ్‌లు.. వాటితో కలిసి జీవించడం నేర్చుకోవాలి - ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్
రాబోయే కాలంలో కోవిడ్ -19 అనేక వేవ్ లు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. ఆందోళన చెందకుండా, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వాటితో కలిసి జీవించాల్సిందేనని ఆమె తెలిపారు.
కోవిడ్ -19 మానవ జాతిని విడిచి పెట్టడం లేదు. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికీ విడిచి వెళ్లడం లేదు. తన జన్యు రూపాన్ని మార్చుకుంటూ మన చుట్టూనే తిరుగుతూ ఉంది. డెల్టా, బీటా వేరియంట్స్ అంటూ ఇప్పటికే మన దేశంలో రెండు వేవ్ లు వచ్చి వెళ్లాయి. ఇతర దేశాల్లో అయితే ఇప్పటికే మూడు, నాలుగు వేవ్‌లు అయిపోయాయి. ఇండియాలో ఇక కరోనా బెడద ఉండదు అనుకుంటున్న సమయంలో మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చి చేరుతోంది. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అధికారికంగా 38 దేశాల్లో గుర్తించింది. ఇండియాలో ఈ వైరస్ కేసులు 1400 వందలను దాటాయి.
కారును పళ్లతో లాగుతూ.. బీభత్సం సృష్టించిన పులి... వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...
2021 డిసెంబర్ 2వ తేదీన ఈ ఒమిక్రాన్ వేరియంట్ న్ భారత్‌లోని కర్నాటక రాష్ట్రంలో మొదటి రెండు కేసులను గుర్తించారు. దాదాపు నెల రోజుల్లో ఈ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే దీనికి గత వేరియంట్ డెల్టా కంటే మూడు రేట్లు ఎక్కువ వేగంగా వ్యాపించే లక్షణం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తోంది. అయితే ఈ కొత్త వేరియంట్ తో పాటు కోవిడ్ -19 డెల్టా వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రోజుకు 10 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం.
కొత్త వేవ్‌లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి..
డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకున్న పడుతున్న నేపథ్యంలో ప్రముఖ వైరాలజిస్ట్ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు మరిన్ని కోవిడ్ -19 వేవ్స్ ఉంటాయని, వాటిని స్వీకరించేందు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అవి ఇప్పుడు మన జీవితంలో భాగమని, వాటితో కలిసి జీవించాల్సిందే అని అన్నారు. “ మనం SARS-CoV-2, దాని ఇతర వేరియంట్లు వస్తూనే ఉంటాయి. ఈ వేరియంట్లతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. అయితే అదృష్టవశాత్తు ఈ ఒమిక్రాన్ ఇతర వేరియంట్‌ల కంటే చాలా తక్కువ తీవ్రతతో ఉందని తెలుస్తోంది’’ అని ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్లు పిల్లలలో చాలా తక్కువ తీవ్రతలో ఉంటోందని ఆమె అన్నారు. కాబట్టి పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపిస్తేనే బాగుంటుందని తెలిపారు. ప్రస్తుతం చాలా తక్కువ డేటా అందుబాటులో ఉన్నందు వల్ల ఇండియాలో ఏ వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా ఇవ్వాలనే విషయాన్ని తాను సూచించలేనని చెప్పారు.
coronavirus: భారత్ పై కరోనా పంజా.. 22వేలకు పైగా కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఆందోళన !
దేశంలో 1,431 చేరిన ఒమిక్రాన్ కేసులు..
భారత్ లో ఇప్పటి వరకు 1,431 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో 488 మంది కోలుకొని ఇంటికి వెళ్లారని చెప్పింది. దేశంలో 454 ఒమిక్రాన్ కేసులతో మహరాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 351 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉందని కేంద్రం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.