కత్తి తీసుకుని సీఎం వద్దకు.. సీఎంని చంపేస్తాడట

Man with knife tries to attack Kerala CM at Delhi
Highlights

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఢిల్లీలో కలకలం రేపాడు. కేరళకు చెందిన విమల్ రాజ్ అనే వ్యక్తి జేబులో జాతీయ జెండా.. చేతిలో పేపర్లు, కత్తి తీసుకుని ఢిల్లీలోని కేరళ భవన్‌కు వెళ్లాడు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఢిల్లీలో కలకలం రేపాడు. కేరళకు చెందిన విమల్ రాజ్ అనే వ్యక్తి జేబులో జాతీయ జెండా.. చేతిలో పేపర్లు, కత్తి తీసుకుని ఢిల్లీలోని కేరళ భవన్‌కు వెళ్లాడు. గేటు వద్ద భద్రతా సిబ్బంది తనిఖీల నుంచి తప్పించుకున్నప్పటికీ.. చాకచక్యంగా లోపలికి ప్రవేశించడంతో అక్కడి మార్షల్స్ అడ్డుకున్నారు.

తాను నెల రోజుల నుంచి సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని. అయితే అది ఎంత మాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చంపేస్తానని కాసేపు హల్‌చల్ చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న  పోలీసులు అనంతరం విచారణకు పంపారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని.. చేతిలో ఉన్న పేపర్లు కూడా అతని మెడికల్ రిపోర్టులని అధికారులు తెలిపారు.

loader