Ram Mandhir: ‘మోడీ పాలన తర్వాత రామ మందిరాన్ని కూల్చిపారేస్తాం’.. వృద్ధుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్

మోడీ, యోగి కాలం నడుస్తున్నది. రామ మందిరం నిర్మించండి. పూజలు చేయండి. కానీ, వారి కాలం ముగిసిన తర్వాత ఈ రామ మందిరాన్ని కూల్చి పారేస్తాం.. ఓ ముస్లిం వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
 

man sparks outrage with his controversial comments on ram mandhir, after modi yogi era will demolish, throw away ram temple in ayodhya kms

Ram Mandhir: అయోధ్యలో రామ మందిర ప్రారంభ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. ముస్లిం మతానికి చెందిన ఓ వృద్ధుడు ఆ వీడియోలో నోరుపారేసుకున్నాడు. ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామ మందిరం భవిష్యత్తు, నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యానాథ్‌ల పాలన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే సొంత అభిప్రాయాన్ని ఆ వృద్ధుడు వీడియోలో వివాదాస్పదంగా వ్యక్తపరిచాడు.

‘రామ మందిరం నిర్మించండి, అందులో పూజలు చేయండి. కానీ, మోడీ, యోగిల కాలం చెల్లిన తర్వాత.. మేం ఆ రామ మందిరాన్ని కూల్చి పారేస్తాం’ అని ఆ వృద్ధుడు అన్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోడీ, యోగిలతో వారి పీడ కల ముగుస్తుందని వారు భావించడం బాగుంది. కానీ, వారి తర్వాతి తరం వీరి మాటలు విని హద్దులేకుండా చెలరేగిపోతారు అని ఓ యూజర్ ఈ వీడియోపై కామెంట్ చేశాడు.

మరో యూజర్ దీనిపై స్పందిస్తూ.. మోడీ, యోగిలు ప్రజల మనస్సులో నుంచి ఎప్పటికీ చెరిగిపోరు. మీరు మీ మతాన్ని, మీ దేవుడిని ప్రేమించినట్టుగానే మేం కూడా మా రాముడు, సీతా దేవి ఆరాదిస్తాం. మోడీ, యోగిలు ఇక్కడ ఎప్పటికీ ఉండకపోవచ్చు. కానీ, వారి భావజాలం మా గుండెల్లో పదిలం. మా పిల్లలకు కూడా మేం దీన్ని బోధిస్తాం. వచ్చే ఏళ్లలో ఇది మరింత వ్యాప్తి చెందుతుంది. జై శ్రీరాం అంటూ కామెంట్ చేశాడు.

Also Read: Telangana Assembly: మల్లారెడ్డి గూగ్లీ.. ‘అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తా’.. మాది పాల‘కులం’

జనవరి 22 వ తేదీన రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవలే రామ మందిరంలో జరుగుతున్న నిర్మాణ పనుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కాబోతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios