Telangana Assembly: మల్లారెడ్డి గూగ్లీ.. ‘అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తా’.. మాది పాల‘కులం’

తీన్మార్ మల్లన్న, మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లన్నల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శాసన సభలో కాంగ్రెస్‌కు అవసరమైతే మద్దతు ఇస్తావా? అని అడగ్గా ఎమ్మెల్యే మల్లన్న సానుకూలంగా స్పందించాడు. తప్పకుండా మద్దతు ఇస్తానని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 

brs mla, Ex Minister mallareddy and congress leader teenmar mallanna interesting discussion, will support congress if needed kms

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని అధికారాన్ని ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్ నేతలు  కొన్ని రోజులపాటు ఫలితాలను జీర్ణించుకోలేకపోయారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను ఖండిస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వంటి వారు ఖండించారు కూడా. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గూగ్లీ విసిరాడు. అవసరమైతే కాంగ్రెస్‌కూ మద్దతు ఇస్తానని బాంబు పేల్చాడు.

అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బయటికి వస్తుండగా.. తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డాడు. వీరిద్దరూ వెంటనే ఆప్యాయంగా పలకరించుకుని, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంలో వారిద్దరూ ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. తీన్మార్ మల్లన్న మేడ్చల్‌లో పోటీ చేస్తే టఫ్‌గా ఉండేదా? అని అడగ్గా అలా ఏమీ కాదని మల్లన్న అన్నారు. లేదూ.. మల్లన్న ఓడిపోయేవాడన్నట్టుగా తీన్మార్ మల్లన్న కామెంట్ చేశాడు. నువ్వు ఏదైనా అనుకో.. ఎలాగైనా అనుకో అంటూ మల్లారెడ్డి లైట్ తీసుకున్నాడు. మేడ్చల్‌లో తీన్మార మల్లన్న పోటీ చేస్తే ఒక మల్లన్న అయితే.. అసెంబ్లీకి వచ్చేవాడని అన్నాడు.

ఎవరు వచ్చినా ఒక్కటేనా? అని అడగ్గా.. ఒక్కటే కదా అని మల్లారెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న కూడా ఇందుకు అంతే అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. తామిద్దరిదీ పాల‘కులం’ అని వివరించాడు. ఇద్దరికీ పాలతో సంబంధం ఉన్నదని చెప్పాడు.

Also Read: నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..

ఆ తర్వాత కాంగ్రెస్‌కు శాసన సభలో ఏమైనా తక్కువ పడితే సపోర్ట్ చేస్తావా ? అని తీన్మార్ మల్లన్న అడిగాడు. దానికి సమాధానంగా తప్పకుండా ఉంటానని చెప్పాడు. ఎన్నికల వరకే కోపతాపాలు ఉంటాయని, ఆ తర్వాత అంతా ఒకటే అని వివరించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios