ఇటుకల బట్టి యజమాని మహేష్ ఓ వివాహితను వేకువజామున పనికి రమ్మని పిలిచాడు. ఆ సమయంలో టీలో sleeping pills వేసి ఆమెకు ఇచ్చాడు. 

కర్ణాటక : టీలో నిద్రమాత్ర వేసి ఓ వివాహితపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన హిరేబెనకల్‌ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఇటుకల బట్టి యజమాని మహేష్ ఓ వివాహితను వేకువజామున పనికి రమ్మని పిలిచాడు. ఆ సమయంలో టీలో sleeping pills వేసి ఆమెకు ఇచ్చాడు. 

ఆమె మత్తులోకి వెళ్లగానే rape చేశాడు. ఆ తరువాత విషయం గుర్తించిన బాధితురాలు గంగావతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

చత్తీస్ ఘడ్ లో భార్యకు విషం తాగించిన భర్త...
ఇదిలా ఉండగా.. భార్యల మీద భర్తలు సాగించే ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. తాజాగా Chhattisgarh లో ఒక భర్త చేసిన ఇలాంటి పైశాచికత్వ ఘటన వెలుగుచూసింది. రాష్ట్రంలోని జాంజ్ గీర్ చంపా జిల్లాకు చెందిన ఒక భర్త భార్యపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు.

జాంజ్ గీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న దేవ నారాయణ్ తన భార్యకు poison ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతే కాదు అతను గత 15 ఏళ్లుగా తన భార్యను Harassment చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఇదేవిధంగా భార్యకు ఎనిమిదిసార్లు Abortion చేయించాడు. బాధితురాలి తల్లి రష్మీ ల భాయి తన అల్లుని ఆగడాలపై ఫిర్యాదు చేస్తూ, అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 15 ఏళ్ల క్రితం తన కుమార్తెకు ఖోఖ్రా గ్రామనివాసి దేవి నారాయణి తో వివాహం జరిగిందని కొన్నాళ్ల తర్వాత అల్లుడు మద్యానికి బానిస అని తెలిసిందన్నారు. 

పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేత: బీఎస్ఎఫ్ జవాన్ ను అరెస్ట్ చేసిన ఏటీఎస్

తరచూ తమ కుమార్తెను వేధించేవాడు అని, ఏ పని చేసేవాడు కాదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తన కుమార్తె కూలీ పనులు చేస్తూ సంసారాన్ని నెట్టుకు వచ్చేదని, ఇటీవలి కాలంలో పలు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని చివరికి తన కుమార్తె చేత విషం కూడా తాగించాడని అన్నారు.

అయితే తాము వెంటనే తమ కుమార్తెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది అన్నారు. దేవ్ నారాయణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతున్నారు.

పిలవగానే రాలేదని..భార్యను... 
మరో ఘటనలో పిలిచిన వెంటనే పుట్టింటి నుంచి కాపురానికి రాలేదని ఆగ్రహంతో భర్త కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సోమల మండలం 81 ఉప్పరపల్లె పంచాయితీ మల్లోలపల్లెకు చెందిన భాగ్యశ్రీ మూడేళ్ల క్రితం పూతలపట్టు మండలం తుమ్మల పల్లికి చెందిన వేంకటాద్రి తో వివాహం అయ్యింది.

వీరికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య family disputes ఉన్నాయి. మూడు రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేక భాగ్యశ్రీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం అక్కడికి వచ్చిన వెంకటాద్రి తనతోపాటు రావాల్సిందిగా కోరగా.. కొద్దిరోజుల తర్వాత వస్తానని భార్య చెప్పింది.

ఈ విషయమే ఆగ్రహంతో ఉన్న భర్త ఆసుపత్రిలో చూపించుకోని వస్తానని టూవీలర్ పై ఆమెను తీసుకుని సోమశిల కు బయలుదేరాడు. మార్గమధ్యంలో అడుసుమిల్లి పొలాల వద్ద టూవీలర్ ఆపి భార్యను knifeతో విచక్షణారహితంగా గాయపరచి slit throat చేశాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోని రైతులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు పీహెచ్సీకి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమె మృత్యువుతో పోరాడుతోంది సంఘటనా స్థలాన్ని సిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్ పరిశీలించారు.