పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేత: బీఎస్ఎఫ్ జవాన్ ను అరెస్ట్ చేసిన ఏటీఎస్
గుజరాత్ రాష్ట్రంలో ఏటీఎస్ అధికారులు బీఎస్ఎఫ్ లో పనిచేస్తున్న జవాన్ ను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కు ఇండియాకు చెందిన రహస్యాలు అందిస్తున్నారనే నెపంతో సజ్జాద్ మహ్మద్ ఇంతియాజ్ ను అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: గుజరాత్ ఏటీఎస్ అధికారులు Bsf లో పనిచేస్తున్న జవాన్ ను సోమవారం నాడు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కు ఇండియాకు చెందిన రహస్యాలు అందిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. బీఎస్ఎఫ్ జవాన్ Gujarat రాష్ట్రంలోని Bhuj జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు.జమ్మూ కాశ్మీర్ లోని Rajauri జిల్లా సరులా గ్రామానికి చెందిన Sajjad Mohammad Imtiyaz బీఎస్ఎఫ్ ఏ కంపెనీ 74వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. సజ్జాద్ మహ్మద్ ఇంతియాజ్ కచ్ జిల్లాలోని Gandhidham వద్ద ఇండియా -పాకిస్తాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు.
also read:పాకిస్తాన్‌లో ట్రైనింగ్.. నిమజ్జనంలో పేలుళ్లకు కుట్ర, రెక్కీ: ఉగ్రవాదులకు 14 రోజుల రిమాండ్
కచ్ జిల్లాలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో సజ్జాద్ ను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. డబ్బులు తీసుకొని ఇండియాకు చెందిన కీలక సమాచారాన్ని Pakistan కు చేరవేస్తున్నారని Ats ఆరోపించింది.. వాట్సాప్ ద్వారా సజ్జాద్ సమాచారం పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏటీఎస్ అధికారులు సోమవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు. తన సెల్ ఫోన్ ద్వారా బీఎస్ఎప్ కు చెందిన అత్యంత రహస్య, సున్నితమైన సమాచారాన్ని అతను పంపాడని ఆ ప్రకటనలో తెలిపింది. నిందితుడు సజ్జాద్ తన ఆధార్ కార్డులో నమోదు చేసిన సెల్‌ఫోన్ నెంబర్ ద్వారానే పాకిస్తాన్ కు కీలకమైన సమాచారాన్ని చేరవేశాడని ఏటీఎస్ ఆ ప్రకటనలో వివరిందింది.
2011 డిసెంబర్ 1వ తేదీన అటార్జీ రైల్వే స్టేసన్ నుండి సంఝౌతా ఎక్స్‌ప్రెేస్ లో పాకిస్తాన్ కు సజ్జాద్ వెళ్లినట్టుగా ఏటీఎస్ వివరించింది. 2011 డిసెంబర్ 1 నుండి 2012 జనవరి 15 వరకు ఆయన పాకిస్తాన్ లో ఉన్నాడు. సజ్జాద్ సిమ్ కార్డు కాల్ డిటైల్స్ రికార్డులు ఐఎంఈఐ నెంబర్ ను అతని ఫోన్ ను కూడా ఏటీఎస్ అధికారులు పరిశీలించారు. 2011 డిసెంబర్ 14 నుండి 2021 జనవరి 15 వరకు మూడో సిమ్ కార్డును కూడా ఉపయోగించినట్టుగా ఏటీఎస్ గుర్తించింది.
సజ్జాద్ ఉపయోగించిన మూడో సిమ్ Tripuraలోని సత్యపాల్ ఘోష్ పేరుతో నమోదైంది. మూడో సిమ్ 2020 నవంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు యాక్టివ్ గా ఉందని ఏటీఎస్ ప్రకటించింది.కానీ నవంబర్ 10 నుండి డిసెంబర్ 24, 2020 వరకు ఈ సిమ్ యాక్టివ్ గా లేదు. అయితే 2020 డిసెంబర్ 25 నుండి 2021 జనవరి 15వ తేదీ వరకు ఈ సిమ్ కార్డు యాక్టివ్ గా ఉందని ఏటీఎస్ వివరించింది.