నా భార్య.. నిత్యానంద చెరలో ఉంది.. రక్షించండి

First Published 13, Jun 2018, 10:20 AM IST
man in tamilnadu requested collecter to save his wife in the custody of nityananda swami
Highlights

కలెక్టర్ కి మొరపెట్టుకున్న వ్యక్తి

తన భార్యను నిత్యానంద స్వామి నిర్భందించాడని.. ఎలాగైనా తన భార్యను రక్షించాల్సిందిగా ఓ వ్యక్తి మొరపెట్టుకుంటున్నాడు. కొన్ని నెలలకిందట తన భార్య, కుమారుడు బెంగుళూరులోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్ళి, తిరిగి రాలేదని తమిళనాడుకి చెందిన ఓ వ్యక్తి నమ్మక్కల్ జిల్లా కలెక్టర్ కి వివరించాడు.

‘దీనిపై నమ్మక్కల్  టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. పోలీసులు బెంగుళూరు వెళ్లి నా  కుమారుడిని విడిపించారు. అయితే నా భార్య ఆచూకీ మాత్రం ఇంకా తెలియడం లేదు. ఆమె బిడదిలోని స్వామి ఆశ్రమంలోనే ఉంది. నిత్యానంద ఆమె దాచి పెట్టాడు. ఆమెకు  రూ. 11 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ. 5 లక్షల రుణం తీసుకుంది ఓ బ్యాంకులో రూ. 5 లక్షలు, నగలపై రూ. 30 వేల రుణం ఉన్నాయి. ఈ అప్పలన్నీ నిత్యానంద ఆశ్రమానికి, ధ్యాన తరగతులకు ఖర్చు పెట్టడానికి చేసినవే.’ అని తెలిపాడు. 

భార్య కనిపించకపోవడంతో అప్పులిచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారని వాపోయాడు. తాను ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే తన భార్యను బయటికి తీసుకురావాలని, లేకపోతే, తనకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని వాపోయాడు.

loader