అదనపు కట్నం డిమాండ్‌ చేస్తూ మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి.. తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ వీడియో వెలుగు చూడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌ లో దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం వేధింపుల్లో కొత్త పుంతలు తొక్కాడో భర్త. భార్యను బావిలో తాడుతో వేలాడదీశాడు. దీన్నంతా వీడియో తీసి.. అదనంగా రూ.5 లక్షలు ముట్టచెప్పాలంటూ అత్తింటివారికి పంపించాడు.

మధ్యప్రదేశ్‌ లోని నీముచ్‌లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. వరకట్నం డిమాండ్‌తో భార్యను బావిలో వేలాడ తీసిన వ్యక్తి.. ఈ ఘటనను చిత్రీకరించిన నిందితుడు.. వీడియోను తన భార్య బంధువులకు పంపించాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 

పాఠశాలలో కులవివక్ష.. దళిత మహిళ వంట చేసిందని.. రాష్ట్ర అల్పాహార పథకానికి దూరంగా విద్యార్థులు.. చివరికి...

కట్నం కోసం భార్యను బావిలో అత్యంత దారుణంగా వేలాడదీసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆగస్టు 20న నీమచ్‌లో జరిగింది. వివరాల ప్రకారం రాకేష్ కిర్ అనే వ్యక్తి తన భార్య ఉషను బావిలోని నీళ్లలోకి తాడుతో వేల్లాడదీశాడు. ఆ తరువాత దాన్నంతా వీడియో తీశాడు. 

అనంతరం ఆ వీడియోను తన భార్య బంధువులకు పంపించాడు. అది చూసి వారు షాక్ అయ్యారు. తీవ్ర భయాందోళనలతో గ్రామానికి చెందిన కొందరిని సంప్రదించి తమ కుమార్తెను రక్షించాల్సిందిగా అభ్యర్థించారు.

ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 3 నుంచి 5 లక్షల కట్నం డిమాండ్‌తో నిందితుడు అలా చేశాడని పోలీసులు తెలిపారు.