పాఠశాలలో కులవివక్ష.. దళిత మహిళ వంట చేసిందని.. రాష్ట్ర అల్పాహార పథకానికి దూరంగా విద్యార్థులు.. చివరికి...
తమిళనాడులోని ఓ పాఠశాలలో కులవివక్ష ఘటన వెలుగు చూసింది. దళిత మహిళ వండిన భోజనం చేయమంటూ కొంతమంది విద్యార్థులు అభ్యంతరం చెప్పడం కలకలం సృష్టించింది.

తమిళనాడు : సమాజం ఎంత ముందుకు పోయినా.. ఎంత అభివృద్ధి చెందినా కులవివక్షకు సంబంధించిన ఘటనలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది.
ఆ పాఠశాలలో రాష్ట్ర అల్పాహార పథకం అమలులో ఉంది. అయితే ఈ వంటలు చేసేది ఓ దళిత మహిళ. దీంతో పాఠశాలలోని కొంతమంది దళిత మహిళ వండిన ఆహారాన్ని తినేందుకు విద్యార్థులు నిరాకరించారు. కుల వివక్ష చూపిస్తూ దళిత మహిళ వండి పెట్టడంతో పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఉచిత అల్పాహార పథకాన్ని వినియోగించుకోలేదు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టి నుజ్జునుజ్జైన వ్యాన్.. 6 గురు మృతి (వీడియో)
ఈ ఘటన వెలుగులోకి రావడంతో. జిల్లా కలెక్టర్ టి ప్రభు శంకర్ స్పందిస్తూ పాఠశాలను సందర్శించానని తెలిపారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం ఉదయం అల్పాహార పథకాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఈ హిందూ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ విషయం గురించి ప్రశ్నించగా, దళితురాలైన సుమతి ఆహారాన్ని తయారు చేస్తోందని ఒక విద్యార్థి తల్లితండ్రులు పేర్కొన్నారు.
అంతేకాదు ఆమె వంట చేసినన్నిరోజులు తమ బిడ్డ ఆహారం తీసుకోదని పేర్కొన్నారు. అంతేకాదు పాఠశాల పట్టుబట్టినట్లయితే, తమ పిల్లలను పాఠశాల నుండి మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు చెప్పారు.
రాష్ట్రంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో 15.75 లక్షల మంది విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే పథకాన్ని ఆగస్టు 25న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.
తమిళనాడులోని కరూర్ జిల్లాలోని వేలన్ చెట్టియార్ పంచాయతీ యూనియన్ స్కూల్‌లో చదువుతున్న 30 మంది విద్యార్థులలో 15 మంది అల్పాహారం తినడానికి నిరాకరించడంతో, సమస్యను జిల్లా యంత్రాంగానికి నివేదించారు.
ఈ పథకంలో భాగంగా తమ పిల్లలకు అల్పాహారం అందించాలని ఈ 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ కోరారు. అయితే, శ్రీనివాసన్ అభ్యర్థనతో తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఆగస్టు 30 నుండి ఆహారం తినడం ప్రారంభించారు. దీంతో విషయం తీవ్ర స్థాయికి దారితీసింది.
జిల్లా యంత్రాంగం కూడా తమ పిల్లలను ఉదయాన్నే భోజనం చేయడానికి అనుమతించాలని తల్లిదండ్రులందరినీ అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది, అలాంటి విభజనను సహించబోమని ఉద్ఘాటించారు.