ఘజియాబాద్: మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. గర్భవతి అయిన భార్యను చంపడానికి అతను దోపిడీ నాటకమాడాడు. ఈ విషయాన్ని పోలీసులు బుధవారంనాడు వెల్లడించారు. 

ఆ సంఘటన జనవరి 11, 12 తేదీల మధ్య రాత్రి జరిగింది. మరదలితో అఫైర్ పెట్టుకున్న ఆ వ్యక్తి తన భార్యను చంపడానికి దోపిడీ నాటకమాడాడని వారు చెప్పారు. భార్యను చంపడానికి తాను పథక రచన చేసినట్లు అతను అంగీకరించాడదు. 

also Read: ప్రియునితో అఫైర్, భర్తను చంపిన భార్య: పోలీసాఫీసర్ తోనూ రాసలీలలు

తన భార్య సోదరితో తనకు వివాహేతర సంబంధం ఉందని, దాంతో తాను భార్యను చంపడానికి ప్లాన్ చేశానని అతను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తన పిల్లలను చూసుకోవాలనే నెపంతో మరదలిని తనతోనే ఉంచుకోవాలని కూడా ప్లాన్ చేసినట్లు అతను పోలీసులకు చెప్పాడు. 

విషం పెట్టి తన భార్యను చంపడానికి ఇద్దరికి డబ్బులు కూడా ఇచ్చానని, అయితే అది విఫలమైందని కూడా అతను చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరు అతనికి తన భార్యను గొంతు నులిమి చంపిన వ్యక్తిని పరిచేయం చేశారు. 

Also Read: అఫైర్ తో నర్సు హత్య: టీవీ లైవ్ షోలో విస్తుపోయే విషయం

కేసును ఛేదించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విస్తృతంగా పరిశీలించారు. తన భార్యను చంపడానికి అతను ముగ్గురు వ్యక్తులను నియోగించుకున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.. ఈ విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.