మధ్యప్రదేశ్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మితమవుతున్న ఇంటి తాళం చెవిని లబ్దిదారుడు బుదరామ్‌కు గవర్నర్ స్వయంగా అందజేశాడు. ఆ తర్వాత ఆ ఆదివాసి ఇంట్లోనే భోజనం చేశాడు. గవర్నర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు బుదరామ్ ఇంటిలో ఫ్యాన్‌లు ఏర్పాటు చేశారు. ఇంటి ముందు గేటు పెట్టారు. కానీ, గవర్నర్ పర్యటన ముగిసిన తర్వాత ఫ్యాన్‌లు తీసుకెళ్లారు. గేటు పెట్టినందుకు రూ. 14 వేల బిల్లు ఆ పేద ఆదివాసీ చేతిలో పెట్టారు.
భోపాల్: ఆ పేదింటికి రాష్ట్ర గవర్నర్(FGovernor) వచ్చి భోజనం చేశాడు. ఆ ఇంటి యజమాని ఎంతో సంతోషించాడు. కానీ, అంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. గవర్నర్ పర్యటన సమయంలో ఆ ఇంట్లో అమర్చిన ఫ్యాన్‌లు అధికారులు వెనక్కి తీసుకువెళ్లిపోయారు. అంతేకాదు, ఆ ఇంటికి ముందు మంచి గేటును ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ గేటు ఏర్పాటు చేసినందుకు రూ. 14 వేల బిల్లు(Bill) వేసి చేతిలో పెట్టారు. దీంతో ఆ వ్యక్తి బోరుమన్నాడు. ఈ గేటుకు నేను డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే అసలు ఏర్పాటు చేయనివ్వకపోయేవాడినని తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhyapradesh)లోని విదిషా జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదివాసి బుదరామ్‌కు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీం కింద ఇల్లు మంజూరు చేశారు. ఆగస్టులో ఈ ఇంటికి గృహప్రవేశం చేశారు. నిర్మాణంలో ఉన్న ఆ పక్కా ఇంటి తాళం చెవిని బుదరామ్‌కు ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ మంగుబాయ్ సీ పటేల్ స్వయంగా ఆ తాళం చెవిని బుదరామ్‌కు అందజేశారు. ఆగస్టు 24న గవర్నర్ విదిషా జిల్లా పర్యటనలో ఉన్నారు. అప్పుడే ఆయన స్వయంగా ఇంటి తాళం చెవి బుదరామ్‌కు అందజేశారు. గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు, వారి ఇంటిలోనే భోజనం చేస్తామనీ ప్రకటించారు.
Also Read: పంచాయతీ ఎన్నికల రద్దు.. ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్న మధ్యప్రదేశ్ సర్కార్..!
గవర్నర్ ఆ ఇంటికి వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగి.. ఇంటిలో ఫ్యాన్‌లు అమర్చారు. ఇంటి ముందు ఒక ఫ్యాన్సీ గేటు అమర్చారు. ఫొటోలు దిగడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గవర్నర్ మంగుబాయ్ సీ పటేల్ ఆ ఇంటికి వెళ్లాడు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఇంటిలోనే భోజనం చేశారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లి పోయిన తర్వాత అధికారులు ఇంటిలో అమర్చిన ఫ్యాన్‌లను వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన గేటు కోసం రూ. 14వేల బిల్లు వేశారు. బుదరామ్‌కు కొత్త ఇంటితోపాటు గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆరు నెలల తర్వాత ఇప్పటికీ ఆ ఇంటికి గ్యాస్ కనెక్షన్ రాలేదు. ఆ ఇల్లు కూడా ఇంకా పూర్తికాలేదు.
బుదరామ్‌కు ఎదురైన సమస్యను రాష్ట్ర పట్టణ అభివృద్ధి మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది గవర్నర్ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. పేద వ్యక్తి బుదరామ్‌కు ఎదురైన అనుభవం కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వార్ బద్దలైంది.
Also Read: ఆ ఊరు తీరే వేరు.. గ్రామ సర్పంచ్ పదవికి వేలంపాట.. ఎక్కువ పాడిన వారే సర్పంచ్
మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు (Madhya Pradesh Panchayat polls) సంబంధించి కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనకు శివరాజ్ సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గం ఆదివారం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ప్రతిపాదనను గవర్నర్ ఛగన్‌భాయ్ మంగూభాయ్ పటేల్‌కు పంపారు. ఈ ప్రతిపాదనపై గవర్నర్ ఆమోద ముద్ర వేసి ఎన్నికలను రద్దు చేయమని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
