కేవైసీ అప్‌డేషన్ కోసం రూపాయి పంపమన్నారు: కట్ చేస్తే, 13 లక్షలు గోవిందా
సులభంగా డబ్బు సంపాదించేందుకు కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. సైబర్ పోలీసులు ఎంతగా నిఘా వేస్తున్నప్పటికీ వారిని దాటుకుని మరి మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.
సులభంగా డబ్బు సంపాదించేందుకు కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. సైబర్ పోలీసులు ఎంతగా నిఘా వేస్తున్నప్పటికీ వారిని దాటుకుని మరి మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా కేవైసీ అప్‌డేట్ చేస్తామంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి కొందరు ఏకంగా రూ.13 లక్షలు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధానే జిల్లా అంబర్‌నాథ్ వర్తక్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి యంత్రాల కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Also Read:లోన్ ఇప్పిస్తానని కోట్లు వసూలు: టాలీవుడ్ హీరో అరెస్ట్
ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. మీ పేటిఎం అకౌంట్ కేవైసీ అప్‌డేట్ చేయాలని అవతలి వైపు గొంతులో వినిపించింది. వారి మాటలు నమ్మిన ఆయన ఇది నిజమేనని భావించి ఫోన్‌లో చెప్పినట్లుగా చేశాడు.
అయితే వెరిఫికేషన్ కోసం ఓ రూపాయి పంపించాలని చెప్పడంతో ఆయన అలాగే పంపారు. ఇది ముగిసిన కొద్దిరోజులకు ఆయన ఫోన్‌కు వరుస పెట్టి మేసేజ్‌లు పోటెత్తాయి. ఆయన పేటిఎంకు అనుసంధానించిన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.13,09,911 రూపాయలు విత్ డ్రా అయినట్లు ఆ సందేశాల సారాంశం.
Also Read:బీ అలర్ట్: అక్కడ S అనే అక్షరం ఉందో లేదో చూసుకోండి.. లేదంటే..
దీనితో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆ ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక సాయంతో నిందితులను రాహుల్ శర్మ, రోహిత్ శర్మగా గుర్తించారు. వారిపై ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.