రుణాలను తీసుకుని మోసం చేసిన కేసులో తెలుగు సినీ హీరోను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘‘ ఎవడ్రా హీరో’’ చిత్రంలో కథానాయకుడిగా పనిచేసిన బషీద్ రుణాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేశాడు.

Also Read:బాలయ్య పొలిటికల్ పంచ్ ఎవరిపై.. హాట్ టాపిక్ గా మారిన డైలాగ్

దీనిలో భాగంగా అనేక ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాల పేరుతో బషీద్ ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.30 లక్షల నుంచి రూ కోటి వరకు వసూలు చేశాడు. దీనితో పాటు దుబాయ్‌లోని ఎస్‌బీకే గ్రూప్ పేరుతో అతను నకిలీ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:ఎలా ముద్దు పెట్టాలో అతడే చెప్పాడు.. క్రేజీ హీరోతో లిప్ లాక్ అనుభవం!

ఈ మేరకు దుబాయ్ ఎంబసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బషీద్‌ను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం ఆయనను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.