భార్యతో గొడవ: ఏడాది కొడుకుని కాళ్లతో తొక్కి చంపాడు

First Published 23, Jun 2018, 11:08 AM IST
Man crushes 1-yr-old son under his feet after fight with wife
Highlights

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. భార్యతో గొడవ పడిన వ్యక్తి ఆగ్రహాన్ని నిలువరించుకోలేక తన ఏడాది కొడుకును కాళ్లతో తొక్కి చంపేశాడు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన ప్రాంతం చాందౌసి కోట్వాలి పోలీసు స్టేషన్ పరిధిలో ఉంది. 

ఏదో విషయంపై అర్షద్ తన భార్య అకిలతో గొడవ పడ్డాడు. దాంతో కోపాన్ని అదుపు చేసుకోలేక తన ఏడాది వయస్సు గల చిన్నారి అర్హన్ ను కాళ్లతో తొక్కాడు. దాంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

loader