తమ్ముడికి కూడా పెళ్లయ్యింది.. ఇక తనకు పెళ్లవ్వదేమో అన్న బెంగతో ఆత్మహత్య

man commits suicide for unable to marriage
Highlights

వివాహం కాదేమో అన్న ఆవేదన ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తమ్ముడికి కూడా పెళ్లయ్యింది.. ఎన్ని సంబంధాలు చూసినా తగిన పిల్ల దొరకపోవడంతో మానసిక ఆందోళనకు గురైన సూరత్‌కు చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. స్త్రీ,పురుష నిష్పత్తిలో హెచ్చుతగ్గులు, ఉన్నత చదువులు, స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు నిశ్చయించుకోవడం.. వయసు మీద పడటం వంటి కారణాలతో చాలామంది అబ్బాయిలు బ్యాచిలర్లుగానే మిగిలిపోతున్నారు.. ఇది చాలా మంది పురుషులను కుంగదీస్తోంది.

ఈ నేపథ్యంలో తన తమ్ముడికి కూడా పెళ్లయ్యింది.. తనకు ఇక పెళ్లవ్వదేమో అన్న ఆవేదనతో ఓ అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లోని సూరత్‌కు చెందిన చేతన్ సర్వియాగా.. స్థానిక అమిటీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నాడు.. నిన్న ఉదయం అతడు ఆఫీసులోని  ఓ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.. వెంటనే తోటి సిబ్బంది ఈ విషయాన్ని యజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు..

రంగంలోకి దిగిన పోలీసులకు కార్యాయంలోని అతని ఛాంబర్ వద్ద సూసైడ్ నోట్ దొరికింది. దానిలో ‘ వివాహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి.. తమ్ముడికి కూడా పెళ్లయ్యింది.. నాకు మాత్రం అమ్మాయి దొరకడం లేదు అందుకే చనిపోతున్నానని’ లేఖలో పేర్కొన్నాడు.. 
 

loader