అతని ప్రవర్తన తేడాగా ఉండటంతో..  దుకాణంలో పనిచేసే వర్కర్ కి అనుమానం  కలిగింది. దీంతో.. అతను అక్కడ ఉండగానే.. వెంటనే పోలీసులను సమాచారం అందించాడు. 


ఓ వ్యక్తి.. బంగారం దుకాణంలో ఉంగరం చోరీకి యత్నించాడు. అయితే.. అతనిని.. వెంబడించి మరీ పోలీసులు పట్టుకోవడం గమనార్హం. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: మమతకు షాకిచ్చిన సోనియా.. విపక్ష నేతల సమావేశానికి తృణమూల్‌కు దక్కని ఆహ్వానం

ఢిల్లీలోని కనట్ ప్రాంతంలోని తనిష్క్ జ్యూవెలరీ దుకాణంలోకి ఓ 27ఏళ్ల యువకుడు ప్రవేశించాడు. వివిధ రకాల నగల గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. బంగారం కొనేవాడిలా నటించి.. ఉంగరం కాజేయాలని అనుకున్నాడు. అయితే.. అతని ప్రవర్తన తేడాగా ఉండటంతో.. దుకాణంలో పనిచేసే వర్కర్ కి అనుమానం కలిగింది. దీంతో.. అతను అక్కడ ఉండగానే.. వెంటనే పోలీసులను సమాచారం అందించాడు.

Also Read: సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించాలి - సుప్రీంకోర్టు

వెంటనే పోలీసు కానిస్టేబుల్ ఒకరు.. మఫ్తీలో.. బంగారం దుకాణం వద్దకు చేరుకున్నారు. అయితే.. ఇంతలో.. దొంగ దుకాణంలో ఉంగరం తీసుకొని.. బయటకు పరిగెత్తాడు. ముందుగానే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్.. అతనిని ఛేజ్ చేసి మరీ పట్టుకోవడం గమనార్హం. 

నిందితుడిని ప్రవీణ్‌గా గుర్తించారు. కాగా అతను సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నిస్తుండటం గమనార్హం. అతని వయసు 27 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు చెప్పారు. అతను హర్యానాలోని రోహ్‌తక్ నివాసి అని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి ఉంగరాన్ని స్వాధీనం చేసుకొని దుకాణంలో అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

కాగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోలో నిందితుడు.. మాస్క్ ధరించి ఉన్నాడు. నెమ్మదిగా దుకాణంలోకి ఉంగరాన్ని చోరీ చేయాలని ప్రయత్నించాడు.