మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని నౌదరాబ్రిడ్జ్ హనుమాన్ మందిరంలో సమీపంలో రోజంతా కష్టపడి ఉన్నాడో ఏమో.. రాత్రి చల్లగాలికి అలా నడుం వాల్చి ఆదమరిచి ఒక కూలి నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో కొద్దిరోజుల నుంచి మట్టినిపోస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న రాత్రి కూడా యధావిధిగా ఒక డంపర్‌తో మట్టిని బొర్లించి వెళ్లిపోయారు... కానీ అక్కడ మనిషి నిద్రపోతున్న సంగతి వారు గమనించలేదు.

ఉదయం పూట వాకింగ్‌కు వెళ్తున్న కొందరు కుక్క చేస్తున్న వింత పనులతో వెళ్లి చూడగా.. అక్కడ ఏదైనా మృతదేహం ఉందనుకుని పోలీసులకు సమాచారం అందించారు. మట్టిని తొలగించి చూడగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే అతనిని వెలికితీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.