ఆగ్రాలో యువకుడిపై మూత్ర విసర్జన చేసినందుకు ఒక వ్యక్తి, అతని సహాయకుడు అరెస్టయ్యారు. వీరిద్దరినీ మంగళవారం మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవలి కాలంలో దళితులపై మూత్రవిసర్జన, మలం పూయడం ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ఘటన కలవరపెడుతోంది. 

ఓ యువకుడిపై ఒక వ్యక్తి, అతని సహచరుడు మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను జూలై 24న అరెస్ట్ చేశారు.

బైక్‌ తో ఎలుకను నలిపి చంపిన వ్యక్తి.. వీడియో వైరల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే....

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి, నిందితులకు శత్రుత్వం ఉంది. సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు నెలల క్రితం ఈ ఘటన జరిగిందని ఆగ్రా డీసీపీ సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు. ప్రధాన నిందితుడు ఆదిత్య, అతని సహచరుడు భోలాను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

ఆదిత్యకు క్రిమినల్ నేపథ్యం ఉందని, జైలుకు కూడా వెళ్లాడని చెబుతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆదిత్య మూత్ర విసర్జన చేసిన బాధితుడు విక్కీగా గుర్తించబడ్డాడు, అతను ఫతేపూర్ సిక్రీ నివాసి అని పోలీసులు తెలిపారు. విక్కీ ఆచూకీ తెలియగానే పరిస్థితి తేలనుందని పోలీసులు తెలిపారు.

ఇలాంటి ఘటనలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ వ్యక్తి కూలీపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియోను గ్రహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించారు.