సారాంశం

నోయిడాలో ఓ వ్యక్తి తన బైక్ కింద ఎలుకను చితక్కొట్టి చంపేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిమీద నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మూగజీవంపై ఇంత కర్కశత్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి రోడ్డుమీద ఓ ఎలుకను తన బైక్ తో చంపి, దాన్ని మళ్లీ మళ్లీ బైక్ వెనకాముందుకు బైక్ ను నడుపుతూ నలిపి, నలిపి చంపేశాడు. దీన్నంతా... పక్కనే ఉన్న బిల్డింగ్ లోనుంచి ఎవరో వీడియో తీశారు. 

పరమేశ్వరుడిని వివాహమాడిన యువతి.. జీవితాన్ని శివుడికే అంకితమివ్వాలనే నిర్ణయం..

దాన్ని సోమవారం సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. అయితే ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లుగా ముందు  వార్తలు వచ్చాయి.  కానీ దీనిమీద పోలీసులు వివరణ ఇచ్చారు. సిఆర్‌పిసి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) సెక్షన్ 151 కింద వేరేకేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు స్పష్టం చేశారు.