బెంగళూరు: బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను అక్రమంగా ఇండియాకు తరలించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని కోల్ కతా విమానాశ్రయంలో భద్రతా అధికారులు పట్టుకున్నారు. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్సు ఫండ్ (యునిసెఫ్) అధికారుల చొరవతో బంగ్లాదేశీ అమ్మాయిలు ఈ నరకకూపం నుండి బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే... పేదరికాన్ని ఆసరాగా చేసుకుని బంగ్లాదేశ్ కు చెందిన అమ్మాయిలను వ్యభిచారం కోసం అక్రమంగా ఇండియాకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఇద్దరు యువతకులను బంగ్లాదేశ్ నుండి కోల్ కతా కు తీసుకువచ్చింది ఓ ముఠా. అమ్మాయిలిద్దరిని అక్రమంగా బంగ్లాదేశ్-ఇండియా బార్డర్ దాటించినట్లు విచారణలో తేలింది. 

ఇలా కోల్ కతా నుండి బెంగళూరుకువారిని రోఫికుల్ ఇస్లాం అనే వ్యక్తి విమానంలో తరలిస్తుండగా ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్సు ఫండ్ (యునిసెఫ్) లోని పిల్లల రక్షణ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారికి అనుమానం వచ్చింది. దీంతో అతడు బెంగళూరు విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశాడు. 

అమ్మాయిలతో కలిసి రోఫికుల్ విమానాశ్రయంలో దిగగానే అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా వ్యభిచారం కోసమే అమ్మాయిలను తరలిస్తున్నట్లు తేలింది. దీంతో అతడిని స్థానిక పోలీసులకు అప్పగించి ఇద్దరు అమ్మాయిలను కాపాడారు.