కమల్ హాసన్ ఇంటికి కన్నం వేసేందుకు వచ్చి.. నాలుక కరచుకున్నాడు

Man arrested for attempting robbery in actor Kamal Haasan house
Highlights

కమల్ హాసన్ ఇంటికి కన్నం వేసేందుకు వచ్చి.. నాలుక కరచుకున్నాడు

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ నివాసంలో చోరి చేసేందుకు ఓ వ్యక్తి  విఫలయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. చెన్నై నగరంలోని ఆళ్వార్‌పేట ఎల్డామ్స్ రోడ్డు సిగ్నల్ సమీపంలో కమల్ నివాసం ఉంది.

దీనిని ఇంటిగానూ.. తన పార్టీ కార్యాలయంగానూ వినియోగిస్తున్నారు కమల్ హాసన్. నిన్న రాత్రి ఆ ఇంటి ప్రహరీపైకి ఎక్కిన ఓ యువకుడు లోపలకు దూకాడు.. అప్పటికే అక్కడ కాపలాగా ఉన్న సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.. పోలీసులు అతను ఎవరా ఏంటా అని ఆరా తీయగా.. ఆ కుర్రాడు దిట్టకుడి ప్రాంతానికి చెందిన శబరినాధన్ అని తెలిసింది. తాను దొంగతనం కోసమే అక్కడికి వెళ్లానని.. అయితే అది కమల్ ఇల్లు అని తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.

loader