Asianet News TeluguAsianet News Telugu

ముదురుతున్న సరిహద్దు వివాదం.. కర్ణాటకకు బస్సు సేవలను నిలిపివేసిన‌ మహారాష్ట్ర

Maharashtra-Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ఎక్కడా ఓ కొలిక్కి రాకుండా వివాదం మ‌రింత‌గా ముదురుతోంది. తాజాగా క‌ర్నాట‌క‌కు మ‌హారాష్ట్ర త‌న బ‌స్సు స‌ర్వీసుల‌ను నిలిపివేసింది. బెలగావి సరిహద్దులో మహారాష్ట్ర ట్రక్కులపై రాళ్లు విసిర‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. 
 

Karnataka - Maharashtra border dispute; Maharashtra suspends bus services to Karnataka
Author
First Published Dec 7, 2022, 12:59 AM IST

Karnataka-Maharashtra border dispute: మహారాష్ట్ర సరిహద్దు వివాదం మ‌రింత‌గా ముదురుతోంది. స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త‌లు పెర‌గడంతో పాటు ఇరు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. ఇప్ప‌టికే స‌రిహద్దు వివాదంపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపాయి. అయిన‌ప్ప‌టికీ ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం సుప్రీంకోర్టులో విచారణకు పెండింగ్‌లో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందిన ట్రక్కులు, బస్సులపై మంగళవారం దాడులు జరిగాయి. ఉద్రిక్తత కారణంగా, మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌టీసీ) మంగళవారం మధ్యాహ్నం పొరుగు రాష్ట్రానికి పోలీసుల సలహాపై బస్సు సర్వీసులను నిలిపివేసింది.

ప్రభుత్వాల మధ్య చర్చలు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపలేదని తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై సీఎంగా ఉండగా, మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (బాలాసాహెబంచి శివసేన) కూటమి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. స‌రిహ‌ద్దు వివాదం ఈ స్థాయికి చేర‌డంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు ఆయా ప్రభుత్వాలపై విమ‌ర్శ‌ల దాడికి దిగాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను ఒక నిర్ణయానికి వచ్చే ముందు అన్ని పార్టీల అభిప్రాయాల‌ను విశ్వాసంలోకి తీసుకోవాలని కోరారు. అలాగే, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యంత్రి సిద్ధరామయ్య సైతం ఇదే డిమాండ్ చేస్తూ, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బొమ్మైని కోరారు.

క‌ర్నాట‌క-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుకు సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి...

 • మంగళవారం బెళగావిలో కన్నడ అనుకూల సంస్థ మహారాష్ట్ర నంబర్‌ ప్లేట్లు ఉన్న ట్రక్కులను ఆపి వాటిపై నల్ల ఇంక్‌తో రాళ్లు రువ్వింది.
 • ఆ తర్వాత రోజు, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఉద్ధవ్ థాక‌రే వర్గానికి చెందిన కార్యకర్తలు పూణెలో కర్ణాటక లైసెన్స్ ప్లేట్‌లతో కూడిన బస్సులపై 'జై మహారాష్ట్ర' అని రాసుకొచ్చారు. 
 • శరద్ పవార్ మాట్లాడుతూ, ఈ సమస్య "రాంగ్ టర్న్ తీసుకోకూడదనీ, ప్రతిపక్షాల సహనాన్ని పరీక్షించవ‌ద్ద‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని ఎంపీలందరినీ ఆయన కోరారు.
 • రాజకీయ కారణాలతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని లేవనెత్తిందనీ, సరిహద్దు ప్రాంతాలకు అన్యాయం చేస్తోందని కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య మంగళవారం ఆరోపించారు.
 • ఇద్దరు మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజే దేశాయ్, నాయకులకు నగర ప్రవేశాన్ని నిషేధిస్తూ కర్ణాటకలోని బెలగావి జిల్లా యంత్రాంగం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారు మహారాష్ట్ర ఏకీకరణ సమితి నేతలతో సమావేశం కానున్నారు. సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర హైపవర్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీతో పాటు, వారి ప్రవేశాన్ని నిషేధిస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 కింద నిషేధ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
 • పాటిల్, దేశాయ్‌లను బెలగావిలో ప్రవేశానికి అనుమతించాలని కోరుతూ మహారాష్ట్ర ఏకికరణ్ సమితి నాయకులను మంగళవారం బెలగావిలోని డీసీ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 • టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం ప్రకారం , షోలాపూర్ జిల్లాలోని అక్కల్‌కోట్ తహసీల్ నుండి 10 గ్రామ పంచాయతీలు కర్నాటకలో చేరాలని తమ గ్రామసభల్లో తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ చర్యకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరుతూ షోలాపూర్ కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం పంపారు.
 • ఆరు దశాబ్దాల నాటి సరిహద్దు వివాదానికి సంబంధించిన చట్టపరమైన, ఇతర విషయాల సమన్వయం కోసం మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజే దేశాయ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 • ఈ కేసుపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు కర్ణాటక ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
 • మరాఠీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్నందున, పూర్వపు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావిపై మహారాష్ట్ర దావా వేసింది. ఇది ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన 814 మరాఠీ మాట్లాడే గ్రామాలపై దావా వేసింది.
 • కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల మహారాష్ట్రలోని అక్కల్‌కోట్, షోలాపూర్‌లోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను విలీనం చేయాలని కోరారు. సాంగ్లీ జిల్లాలోని జాట్ తాలూకాలోని కొన్ని గ్రామాలు దక్షిణాది రాష్ట్రంలో చేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Follow Us:
Download App:
 • android
 • ios