Asianet News TeluguAsianet News Telugu

నేతాజీ Subhas Chandra Bose జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించండి.. ప్రధాని మోదీని కోరిన దీదీ

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి (Netaji Subhas Chandra Bose Jayanti) సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రజలు ఘనంగా నివాళుర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా (national holiday) ప్రకటించాలని Narendra Modiని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు.

Mamata Banerjee urges PM Modi to declare Netaji Subhas Chandra Bose Jayanti as national holiday
Author
Kolkata, First Published Jan 23, 2022, 12:45 PM IST

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి (Netaji Subhas Chandra Bose Jayanti) సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రజలు ఘనంగా నివాళుర్పిస్తున్నారు. నేతాజీ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఒక విజ్ఞప్తి చేశారు. నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా (national holiday) ప్రకటించాలని Narendra Modiని కోరారు. నేతాజీ దేశనేతే కాకుండా ప్రపంచ నేత అని, బెంగాల్ నుంచి ఆయన ఎదిగిన తీరు భారత దేశచరిత్రలో సాటిలేనిదని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

‘నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మేము మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దేశం మొత్తం జాతీయ నాయకుడికి నివాళులర్పించడానికి,  #DeshNayakDibas అత్యంత సముచితమైన రీతిలో జరుపుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది" అని మమతా బెనర్జీ అన్నారు. దేశభక్తి, ధైర్యం, నాయకత్వం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి నేతాజీ ప్రతిరూపమని ఆమె ట్వీట్ చేశారు. నేతాజీ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేతాజీ 125వ జయంతిని 'దేశ్ నాయక్ దిబాస్'గా జరుపుకుంటుందని మమత తెలియజేశారు. ‘నేతాజీ స్మారకార్థం అనేక దీర్ఘకాల కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా అంతర్జాతీయ సహకారంతో జాతీయ విశ్వవిద్యాలయం, 100 శాతం నిధులతో జై హింద్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడుతోంది’ అని మమతా బెనర్జీ తెలిపారు.

 

ఇదిలా ఉంటే.. నేడు గణతంత్ర వేడుకలు(Republic Day Celebrations) ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 24వ తేదీన ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. కానీ, ఈ సారి నేతాజీ జయంతి(Netaji Birth Anniversary) రోజునూ ఈ వేడుకల్లో కలిపారు. దీంతో నేటి నుంచే దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని  ప్రారంభించనున్నారు. దీంతో గణతంత్ర వేడుకలను షురూ చేయనున్నారు. ఇక, గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం నేతాజీ జయంతిని ‘పరాక్రమ్ దివస్‌’ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios