జామియా మిలియా యూనివర్సిటి విద్యార్ధులపై పోలీసులు లాఠీఛార్జీ  చేయడాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వీసీ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:అల్లర్లు వెంటనే నిలిపివేయాలి: జామీయా విద్యార్థుల లాఠీఛార్జీపై సుప్రీం

వైస్ ఛాన్సలర్‌కు అన్ని విషయాలు తెలుసునని, ఆ పదవిలో ఉండటానికి ఆమెకు ఎలాంటి నైతిక అర్హత లేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఢిల్లీ పోలీసులు వారిపై విరుచుకుపడటం సరికాదన్నారు. పరిస్ధితి చేయి దాటి పోయిన సందర్భంలో వీసీ యూనివర్సిటీని విడిచి వెళ్లకుండా ఉండాల్సిందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. 

మరోవైపు అల్లర్లు వెంటనే నిలిపివేయాలని  సుప్రీంకోర్టు  జామీయ యూనివర్శిటీ విద్యార్థులకు సూచించింది. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామీయా యూనివర్శిటీ విద్యార్థులు, యూపీలోని అలీఘడ్ యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టు సోమవారం నాడు స్పందించింది. 

పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను మంగళవారం నాడు విచారణ చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే  ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. ఈ పిటిషన్‌ను విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నిరాకరించారు. విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ ఇందిరా జయ్‌సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Also Read:పౌరసత్వ సవరణ బిల్లు: విద్యార్ధులపై లాఠీఛార్జీ, నిరసనకు దిగిన ప్రియాంక గాంధీ

వచ్చ ఏడాది జనవరి 5వ తేదీ వరకు జామీయా యూనివర్శిటీకి సెలవులు ప్రకటించారు.  నిరసనల పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేయడం సరైంది కాదని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు. తొలుత జామీయా యూనివర్శిటీలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు.