మరో 15-20 రోజుల్లో మహారాష్ట్ర షిండే ప్రభుత్వం కూలిపోతుంది - ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం మరో పదిహేను-ఇరవై రోజుల్లో కూలిపోతుందని ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని తెలిపారు.
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందని శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మరో 15-20 రోజుల్లో అది కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో కీలక నేతగా ఉన్న సంజయ్ రౌత్.. ఆదివారం ‘ఎన్డీటీవీ’తో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని అన్నారు. తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
జాతి వైరం మరిచి.. ఆకలితో ఉన్న కుక్క పిల్లలకు పాలిచ్చిన పంది.. నిర్మల్ లో అరుదైన ఘటన
థాకరే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై (షిండే పార్టీకి చెందిన) అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సంజయ్ రౌత్ ప్రస్తావించారు. ‘‘ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కూలిపోతుంది. ఈ ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయింది. దానిపై ఎవరు సంతకం చేయాలనేది ఇప్పుడే నిర్ణయించాలి’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలోనే షిండే ప్రభుత్వం కూలిపోతుందని సంజయ్ రౌత్ గతంలో చెప్పారు.
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఒక్కొక్కరిపై రూ.14 లక్షల రివార్డు
గత ఏడాది జూన్ లో ఏక్ నాథ్ షిండే.. 39 మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశారు, ఫలితంగా పార్టీ చీలిపోయింది. థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం (ఇందులో ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా ఉన్నాయి) కూలిపోయింది. ఆ తర్వాత షిండే బీజేపీతో పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 జూన్ 30వ తేదీన షిండే సీఎంగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
తమ సీక్రెట్లు బయటపెడుతాడని అతిక్ అహ్మద్ ను ప్రతిపక్షాలే చంపాయి - యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కాగా.. రాష్ట్రంలో గత ఏడాది రాజకీయ సంక్షోభానికి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన క్రాస్ పిటిషన్లపై సుప్రీంకోర్టు గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఇది త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.