Asianet News TeluguAsianet News Telugu

40 మంది శివ‌సేన ఎమ్మెల్యేల పీఎస్ వో ల‌పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌లు.. ఎందుకంటే ?

ఎమ్మెల్యేలు తిరుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నా, రాష్ట్రం దాటి వెళ్లిపోతున్నా.. ఇంటిలిజెన్స్ విభాగానికి గానీ, అధికార యంత్రాంగానికి గానీ సమాచారం అందించని 40 మంది పీఎస్ వో లపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.  వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెకర్లకు ఆదేశాలు జారీ చేసింది. 

Maharashtra government action against PSOs of 40 Shiv Sena MLAs .. because?
Author
Mumbai, First Published Jun 24, 2022, 2:08 PM IST

శివ‌సేనపై తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే, 40 మంది ఎమ్మెల్యేల PSO (ప్రైవేట్ సెక్రటరీ ఆఫీసర్లు, కమాండోలు, కానిస్టేబుళ్లు)పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంవీఏ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌భుత్వంపై తిర‌గ‌బడాల‌ని చ‌ర్చించుకుంటున్న‌ప్పుడు అలాగే మ‌హారాష్ట్ర విడిచి వెళ్లేట‌ప్పుడు వీరంతా ఎమ్మెల్యేల వద్దే ఉంటున్నా.. యంత్రాంగానికి, అలాగే ఇంటిలిజెన్స్ విభాగానికి ఎలాంటి స‌మాచార‌మూ ఇవ్వ‌లేదు. ప్ర‌భుత్వానికి స‌మాచారం అందించ‌డంలో పీఎస్ వోలు అంతా విఫ‌ల‌మ‌య్యార‌ని పేర్కొంటూ వారిపై చర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు చెందిన ఈ అధికారులపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

బాప్ రే..శునకం బర్త్ డే పార్టీకి 100 కిలోల కేక్, 5వేలమందికి విందుభోజనం..

కాగా తాము చ‌ట్ట‌ప‌రంగా పోరాడుతామ‌ని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఇప్పటి వరకు శివసైనికులు రోడ్డెక్కలేద‌ని అన్నారు. పేపర్ ఫైట్ అయినా, వీధి పోరాటమైనా మేమే గెలుస్తామ‌ని చెప్పారు. అయితే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా రాయగఢ్ జిల్లాలో బ్యానర్లు వెలిశాయి. బ్యానర్‌లో బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ డిఘేల ఫొటోలు ఉన్నాయి. సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ఫొటో ఇందులో క‌నిపించ‌డం లేదు. ‘‘ హిందుత్వ ఆలోచనను ముందుకు తీసుకెళ్లినందుకు, ధరమ్‌వీర్ ఆనంద్ డిఘే బోధనలను ముందుకు తీసుకెళ్లినందుకు హిందూ హృదయ సామ్రాట్ శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రేకు అభినందనలు ’ అని ఆ బ్యాన‌ర్ల‌లో పేర్కొన్నారు. రాయ్‌గఢ్‌లోని మాంగావ్, గోరేగావ్, లోనేర్, మహద్ ప్రాంతాల్లో ఇలాంటి బ్యాన‌ర్లు క‌నిపించాయి. 

గుజరాత్ అల్లర్లు: పీఎం మోడీకి సుప్రీం క్లీన్ చిట్.. జాకియా జాఫ్రీ పిటిషన్ కొట్టివేత

కాగా ఏక్ నాథ్ షిండే శాసనసభలో తమ గ్రూపు నాయకుడిగా కొనసాగుతారని పేర్కొంటూ శివసేన లెజిస్లేచర్ పార్టీ 37 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మద్దతు లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ కు పంపారు. శివసేన లెజిస్లేటివ్ పార్టీ చీఫ్ విప్ గా భరత్ గోగవాలేను నియమించినట్లు ఏక్ నాథ్ షిండే తెలిపారు. అయితే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని, మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గుతుందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ ఎంవీఏ ప్రభుత్వ భవితవ్యం గువాహటిలో కాకుండా అసెంబ్లీలోనే నిర్ణయించబడుతుంది. సభలో ఎంవీఏ తన మెజారిటీని నిరూపించుకుంటుంది ’’ అని శరద్ పవార్ పేర్కొన్నారు.

Lancet journal: దేశంలో 42 ల‌క్ష‌ల మ‌ర‌ణాల‌ను త‌గ్గించిన కోవిడ్ టీకాలు !

శ‌ర‌ద్ ప‌వార్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత నారాయణ్ రాణే మండిపడ్డారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను పవార్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విష‌యంలో ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘‘ మేము అలాంటి బెదిరింపులకు భయపడము. మేము చట్టం ప్రకారం నడుచుకుంటుంన్నాం. ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా మాతో చేరారని వారి అఫిడవిట్‌లు మా వద్ద ఉన్నాయి. మెజారిటీ సంఖ్య మా వద్ద ఉంది. 40 మందికి పైగా సేన ఎమ్మెల్యేలు, 12 మంది స్వతంత్రులు, ఇతరులు మాతో ఉన్నారు” అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం శాసనసభ కార్యకలాపాల కోసం పార్టీ జారీ చేసే విప్ చెల్లుబాటు అవుతుంద‌ని, కానీ స‌మావేశాలకు అది వ‌ర్తించద‌ని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios