Asianet News TeluguAsianet News Telugu

బాప్ రే..శునకం బర్త్ డే పార్టీకి 100 కిలోల కేక్, 5వేలమందికి విందుభోజనం..

పెంపుడు శునకం బర్త్ డే వేడుకలు చాలా గ్రాండ్ గా చేశాడో వ్యక్తి.. వందకేజీల కేక్ కట్ చేయడమే కాకుండా.. 5వేలమందికి విందు భోజనం ఏర్పాటు చేశాడు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ పార్టీ వెనుక పొలిటికల్ టచ్ కూడా ఉందట. 

man celebrates pet dogs birthday by cutting 100 kg cake in karnataka
Author
Hyderabad, First Published Jun 24, 2022, 1:27 PM IST

కర్నాటక : చాలామంది పెంపుడు జంతువుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా అవి కనిపించకుండాపోతే వాటి యజమానులు చాలా బాధ పడుతుంటారు. ఏకంగా మీడియాలో.. లేదా వాల్ పోస్టర్లు వేసి నా పిల్లి పోయింది లేదా నా కుక్క పోయింది.. ఆచూకీ చెబితే.. తగిన బహుమతి ఇస్తామని ప్రకటించిన వారు కూడా ఉన్నారు. అయితే, ఓ వ్యక్తి  తన పెంపుడు కుక్కపై ఉన్న అభిమానాన్ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేశాడు. అయితే, ఈ కథకు పొలిటికల్ టచ్ కూడా ఉండడంతో ఊరు ఊరంతా పిలిచాడు. వంద కిలోల కేక్ కట్ చేశాడు. మందు లేదు కానీ.. మాంసంతో మంచి భోజనం వడ్డించాడు. అతిథులు కేక్ తిని భోజనాలు చేసి…ఆ కుక్కకు శుభాకాంక్షలు తెలిపారు.

కర్ణాటకలో జరిగిన ఈ బర్త్ డే పార్టీ దాని వెనుక పొలిటికల్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… శివప్ప మర్డి బెలగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి..  కుక్కను పెంచుకుంటున్నాడు.  దానికి ‘క్రిష్’  అని పేరు పెట్టుకున్నాడు. క్రిష్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. గ్రామంలోని దాదాపు 5 వేల మందిని పిలిచి మంచి భోజనం వడ్డించాడు. పుట్టినరోజు వేడుకల్లో 100 కిలోల కేక్ కట్ చేయడమే కాదు..  300 కిలోల మటన్, పెద్ద సంఖ్యలో గుడ్లను తెప్పించాడు. నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్.. వెజ్ తినే వారి కోసం ప్రత్యేకంగా కూరగాయలు తెప్పించి భోజన ఏర్పాట్లు చేశాడు. కేక్ కట్ చేసిన తర్వాత కుక్కను వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు.

యజమానులకోసం కుక్క ప్రాణత్యాగం.. కంటతడి పెట్టిస్తున్న శునకం ‘నిజాయితీ’..

గ్రామంలోని ప్రజలందరూ దానికి నమస్కరించారు. అయితే, క్రిష్ మీద  శివప్ర మర్డికి  ప్రేమ ఉన్నా.. పార్టీ వెనుక మాత్రం చిన్న పొలిటికల్ టచ్ కూడా ఉంది. అదేంటి అంటే..  శివప్ప మర్డి  గత 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. ఓసారి కొత్త పంచాయతీ సభ్యుడు ఒకరు తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడట. ఆ సందర్భంగా పాత పంచాయతీ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మా హయాంలో పాత పంచాయతీ సభ్యులు వచ్చి కుక్కల్లా తిన్నారని  కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడట. మాటలతో నొచ్చుకున్న శివప్ప మర్డి తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా నిర్వహించి, ఐదు వేల మందిని పిలిచి... భోజనాలుపెట్టి ఔరా అనిపించారు. మొత్తంగా ఈ న్యూస్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios