Asianet News TeluguAsianet News Telugu

నాగ్ పూర్ ల్యాండ్ డీల్ పై యూ టర్న్ తీసుకున్న మహారాష్ట్ర సీఎం షిండే.. కేటాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటన

ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు రావడంతో నాగ్ పూర్ ల్యాండ్ డీల్ నుంచి మహరాష్ట్ర షిండే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ ల్యాండ్ డీల్ ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. 

Maharashtra CM Shinde took a U-turn on the Nagpur land deal and announced that the allotment is being cancelled.
Author
First Published Dec 23, 2022, 10:04 AM IST

నాగ్ పూర్ ల్యాండ్ డీల్ పై మహారాష్ట్ర సీఎం వెనక్కితగ్గారు. 17 మంది డెవలపర్లకు ఐదెకరాల నాగ్ పూర్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ (ఎన్ఐటీ) భూ కేటాయింపును రద్దు చేసినట్లు ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ కు తెలియజేసింది. డిసెంబర్ 14 వరకు తనకు ఈ వ్యవహారం తెలియదని ముఖ్యమంత్రి తన నివేదికలో స్పష్టం చేశారు. 

‘‘ఎన్ఐటీ భూముల్లో కోర్టు పరిశీలనల తర్వాత డిసెంబర్ 14వ తేదీన నాకు దాని గురించి తెలిసింది. దీంతో 17 మంది డెవలపర్లకు భూమి కేటాయింపును సులభతరం చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. తాము అందజేసిన నివేదిక ఆధారంగా కోర్టు ఇప్పుడు తదుపరి చర్యలు తీసుకోవచ్చు’’ అని ముఖ్యమంత్రి కోర్టుకు సమర్పించిన ప్రతిస్పందనలో పేర్కొన్నారు.

రూ.100 కోట్ల మార్కెట్ విలువ చేసే ఐదెకరాల ఎన్ఐటీ భూమిని నాగ్‌పూర్‌కు చెందిన 17 మంది డెవలపర్‌లకు అక్రమంగా కేవలం రూ.2 కోట్లకు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సమయంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో షిండే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ భూకేటాయింపుపై కోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

కీచక ప్రొఫెసర్.. విద్యార్థిని శారీర సంబంధం పెట్టుకోలేదని పరీక్షల్లో ఫెయిల్ చేశాడు..

ఎన్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జితేంద్ర అహ్వాద్ ఈ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తారు. షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రస్తుత సీఎం పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఐటీ భూ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. కుంభకోణం బయటపడిన తర్వాత షిండే కేటాయింపును రద్దు చేసుకున్నాడరు. తనను తాను రక్షించుకోవడానికి ఈ విషయం తనకు తెలియదని కోర్టుకు వివరించాడు, ”అని అని ఆయన ఆరోపించారు. ‘‘ షిండే బాధ్యతల నుండి తప్పించుకోలేరు. విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించలేరు. అయితే భూ కుంభకోణంలో సీఎం షిండే ప్రమేయం ఉందన్న నిజం మహారాష్ట్ర ప్రజలందరికీ తెలుసు’’ అని ఎన్సీపీ నేత అన్నారు. 

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్ బవాన్‌కులే కూడా ఈ విషయంలో ప్రతిపక్షాల తరుఫున చేరారు. ఎన్ఐటీ భూ కేటాయింపుపై విచారణకు డిమాండ్ చేశారు. కాగా అంతకు ముందు ఎన్‌ఐటీ భూ కుంభకోణంలో షిండే రాజీనామా చేయాలని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయమైన విచారణ జరగాలంటే షిండే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కోరారు.

కదులుతున్న రైలులో మహిళ మీద దాడి చేసిన వ్యక్తి.. పిడిగుద్దులు కురిపిస్తూ.. వీడియో వైరల్...

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. నాగ్ పూర్ భూకేటాయింపు కేసులో ప్రతిపక్షాలు తలమునకలైపోయాయని, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 2021 నాటి క్రమబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయాన్ని బాంబే హైకోర్టు గమనించిందని అన్నారు. ఈ కేసును మూసివేసిందని చెప్పారు. 

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు భూ కేటాయింపుల విషయంలో ఎలాంటి కుంభకోణమూ జరగలేదని అని ఫడ్నవీస్ చెప్పారు. ‘‘16-12-2022 నాటి ఉత్తర్వుల ప్రకారం క్రమబద్ధీకరణ ఉత్తర్వులను ముఖ్యమంత్రి ఉపసంహరించుకున్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ కోర్టు జారీ చేసిన 14-12-2022 నాటి ఉత్తర్వు ఉద్దేశ్యం నెరవేరిందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు ఈ సమస్య ముగిసింది ’’ అని చెప్పారు. కాగా.. ఇక రెగ్యులరైజేషన్ విషయానికి వస్తే, పిటిషన్ తుది ఫలితాన్ని బట్టి (నాగ్ పూర్ కేటాయింపు కేసుకు సంబంధించి) చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఎన్సీపీ ఎమ్మెల్యే సస్పెండ్ 
స్పీకర్ రాహుల్ నర్వేకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ను మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండ్ చేసింది. దిశా సలియన్ హత్య కేసును తిరిగి తెరవాలనే డిమాండ్ మధ్య స్పీకర్.. బీజేపీ, షిండే గ్రూపును మాత్రమే మాట్లాడడానికి అనుమతించారు. అయితే ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ కు తప్ప మిగితా వారెవరీకి ఈ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంపై మాట్లాడలేకపోయినందుకు విసుగు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ఆగ్రహంతో స్పీకర్పై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. 

సుశాంత్ మేనేజర్ మరణంపై సిట్ విచారణ
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా సలియన్ మృతిపై దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. దిశా సలియన్ ది ఆత్మహత్య కాదని, ఆమెది హత్య అని బీజేపీ ఎమ్మెల్యే నీలేష్ రాణే ఆరోపించారు. దిశా సలియన్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆదిత్య ఠాక్రే పార్టీలో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆమె మరణానికి ఠాక్రే కారణమని వారు అన్నారు. ఈ కేసులో సరైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios