Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న రైలులో మహిళ మీద దాడి చేసిన వ్యక్తి.. పిడిగుద్దులు కురిపిస్తూ.. వీడియో వైరల్...

కదులుతున్న ట్రైన్ లో ఓ వ్యక్తి మహిళ మీద దాడికి దిగాడు. ఆమెను పిడిగుద్దులు గుద్దుతూ,బట్టలు లాగేస్తూ.. జుట్టు పీకేస్తూ హంగామా సృష్టించాడు. 
 

Video Shows Man And Woman Fighting On Crowded Hong Kong Train
Author
First Published Dec 22, 2022, 1:48 PM IST

హాంగ్ కాంగ్ : బహిరంగ ప్రదేశాల్లో గొడవపడడం, కొట్టుకోవడం మన దగ్గరే కాదండోయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుంది. అది కూడా ఎక్కడో ఇంట్లోనో,రోడ్డుమీదో.. చదువుకోని వారో చేసింది కాదు... ఓ కదులుతున్న ట్రైయిన్ లో.. వెడుతున్న ఓ మహిళ, ఓ పురుషుడు కొట్టుకున్నారు. దీంతో ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాంకాంగ్ లోని ఎమ్టీఆర్ రైలు చాలా రద్దీగా ఉంది. ఆ ట్రైన్లో ఒక్కసారిగా  ఒక పురుషుడు, మరో మహిళ గొడవకు దిగారు. 

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి..కాస్త పొట్టిగా ఉన్న అమ్మాయి మీద ఒక్కసారిగా పిడిగుద్దులు కురిపించాడు. ఆమె బట్టలు లాగాడు.. జుట్టు పట్టుకుని లాగాడు. ఆమె తిరిగి అతడి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె బలం సరిపోలేదు. ఇంతలో ట్రైయిన్ కుదుపులకు మహిళతో సహా ఆమె వెనక నిలబడ్డవారందరూ ఒక్కసారిగా కిందపడ్డారు. 

ఈ వీడియో 13 సెక్లను ఉంది. ఇందులో ఓ వ్యక్తి మహిళను కొడుకున్న వ్యక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం కూడా కనిపిస్తుంది. కలబడి కొట్టుకుంటున్న వారిని విడదీయడానికి మరో వ్యక్తి ప్రయత్నించడం కనిపిస్తుంది. ఈ వీడియోను ఎవరో ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా దీనిమీద స్పందిస్తున్నారు. 

ఈ వీడియో డిసెంబర్ 18న "టుడే రివ్యూ67" అనే ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో మీద ఎలాంటి డేట్ లేదు. ఇప్పటికే ఈ వీడియో ఫేస్‌బుక్‌లో 1500 కంటే ఎక్కువ లైక్‌లు, అనేక కామెంట్స్ తో 2 లక్షలకు పైగా వ్యూస్ ను కలిగి ఉంది. ఎస్ సిఎమ్ పి ప్రకారం, ఈ ఫైట్ తుంగ్ చుంగ్ లైన్‌లో జరిగింది. అయితే, గొడవకు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios