Asianet News TeluguAsianet News Telugu

లోకాయుక్త బిల్లును ఆమోదించిన మహారాష్ట్ర అసెంబ్లీ.. ఈ చట్టం తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా రికార్డు..

మహారాష్ట్ర అసెంబ్లీ చారిత్రాత్మక లోకాయుక్త బిల్లును ఆమోదించింది. దీంతో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. 

Maharashtra assembly passes Lokayukta bill Record as the first state to bring this law.
Author
First Published Dec 28, 2022, 4:09 PM IST

ముఖ్యమంత్రి, మంత్రుల మండలిని అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ పరిధిలోకి తీసుకువచ్చే లోకాయుక్త బిల్లు -2022ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. అయితే భారతదేశంలో మొదటి సారిగా ఈ లోకాయుక్త బిల్లును తీసుకొచ్చి, ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాగా.. విపక్షాల గైర్హాజరీ, చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. 

లైంగిక వేధింపుల కేసు.. కేరళ మజీ సీఎం ఉమెన్ చాందీకి సీబీఐ క్లీన్ చిట్..!

ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది. సభ సమావేశాల ముందు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలాంటి తీర్మానాన్ని మహారాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యులలో మూడింట రెండొంతుల మంది కంటే తక్కువ కాకుండా ఆమోదించాలని ముసాయిదా బిల్లు పేర్కొంది. ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలపై వచ్చిన అంశం రాష్ట్రంలో అంతర్గత భద్రత లేదా పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించినది అయితే దానిపై లోకాయుక్త విచారణ చేయరాదని కూడా పేర్కొంది.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. కేంద్రానికి లేఖ..

లోకాయుక్తలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఛైర్ పర్సన్ గా ఉంటారు. సీఎం, డిప్యూటీ సీఎం, శాసన సభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, అసెంబ్లీలో ప్రతిపక్షనేతలు సభ్యులుగా ఉంటారు. కాగా.. ఈ బిల్లు వల్ల ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా లోకాయుక్త పరిధిలోకి వస్తారని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బిల్లు తీసుకురావడానికి ముందు సామాజిక కార్యకర్త అన్నా హజారేతో చర్చించామని ఫడ్నవీస్ చెప్పారు. బిల్లును ఆమోదించిన తర్వాత సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.

కేరళలో దారుణం.. మరో యువకుడితో ఫోన్ లో మాట్లాడుతోందని ప్రేయసిని హత్య చేసిన ప్రేమికుడు..

“ఈ లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా మేము కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసే వ్యక్తి బిల్లును దుర్వినియోగం చేయకూడదు. ఒక వేళ వెరిఫికేషన్ లో ఆ వ్యక్తి తప్పుగా కేసు పెట్టినట్టు తెలిస్తే, అతడిపై చర్య తీసుకునే నిబంధన చట్టంలో పొందుపర్చాం. మేము పారదర్శకతను తీసుకురావాలని, అవినీతిని అంతం చేయాలనుకుంటున్నాము ” అని ఫడ్నవీస్ తెలిపారు. ఈ లోకాయుక్తలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు అందిన నాటి నుంచి ఏడాదిలోపు విచారణ పూర్తవుతుంది.

ధరల పెరుగుదల, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని స‌ర్కారు : కేంద్రంపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఫైర్

కాగా.. ఈ బిల్లును మంత్రి దీపక్ కేసర్కర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే ఉపాధ్యాయుల ప్రవేశ పరీక్షలో అవకతవకలపై ప్రతిపక్షాలు వాకౌట్ చేయడంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ బిల్లును చారిత్రాత్మక చట్టంగా అభివర్ణించారు. ఇలాంటి చట్టాన్ని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం మహారాష్ట్ర అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios