దుబాయ్‌లో మహాదేవ్ యాప్ ప్రమోటర్ అరెస్ట్.. త్వరలో భారత్ కి తరలింపు..

ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ నోటీసు ఆధారంగా రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నామని, అతన్ని త్వరలో భారత్‌కు తరలించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

Mahadev App Promoter Arrested In Dubai, Soon Moving To India  - bsb

న్యూఢిల్లీ : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా ఇద్దరు ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన రవి ఉప్పల్‌ను పోలీసులు దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు. గత వారం ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో అతన్ని భారతదేశానికి తరలించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

రోజుకు రూ. 200 కోట్ల లాభాన్ని ఆర్జించే మహాదేవ్ యాప్ నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలకు ముందు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ యాప్ ప్రమోటర్లు అప్పటి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లించారని క్యాష్ కొరియర్ అసిమ్ దాస్ ఆరోపించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. అయితే, అతన్ని కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు, కొరియర్ కుట్రలో భాగంగా తనను ఇరికించారని, రాజకీయ నాయకులకు తాను ఎప్పుడూ నగదు పంపిణీ చేయలేదని చెప్పాడు.

highlights of 2023 : భారత్ ని కుదిపేసిన సంఘటనలు ఇవే...

తన దర్యాప్తులో, ఉప్పల్ కు పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దేశానికి చెందిన పాస్‌పోర్ట్‌ ఉందని,  దీంతో అతను "స్వేచ్ఛగా" తిరుగుతున్నాడని, కానీ అతని భారత పౌరసత్వాన్ని వదులుకోలేదని ఏజెన్సీ కనుగొంది. అతను ఈ పాస్‌పోర్ట్‌ తో ఆస్ట్రేలియన్ వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాడు. యాప్ ఇతర ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్, ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరిగిన రూ. 200 కోట్ల వివాహానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. 

రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, కపిల్ శర్మలతో సహా పలువురు బాలీవుడ్ నటులు, ఇతర ప్రముఖులు యాప్ కోసం ప్రకటనలలో నటించారు. కొంతమంది దుబాయ్‌లో సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకలో ప్రదర్శనలు ఇచ్చారు. వీరికి ఈడీ సమన్లు ​​పంపింది. చంద్రకర్ ను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఈడీ అధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios