highlights of 2023 : భారత్ ని కుదిపేసిన సంఘటనలు ఇవే...
దేశవ్యాప్తంగా 2023లో అనేక ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. వరల్డ్ కప్ కు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఢంకా మోగించింది.
కొత్త సంవత్సరం ప్రారంభమే ఓ షాకింగ్ ఘటనతో మొదలయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి ఒకటి అర్ధరాత్రి జరిగిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనగా మారింది. అంజలి అనే ఓయూవతి టూవీలర్ పై వస్తుండగా కారుతో ఢీకొట్టిన కొంతమంది ఆమెను అలాగే 13 కీర్తి మీటర్ల వరకు ఈడ్చికెళ్లారు. ఈ ఘటనలో అంజలి మృతి చెందింది. 11మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
బిజెపి ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఢిల్లీలో బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ సాక్షి మాలిక్ లతో పాటు అనేకమంది మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. వీరికి దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వినేష్ ఫోగట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీరి ఆందోళనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత మహిళారేజ్లర్ల ఫిర్యాదు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులు అంగీకరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను విచారించిన ఈడీ.. ఆ తరువాత అరెస్ట్ చేసింది. ఆయనను తీహార్ జైలుకు పంపించారు. అంతకు ముందే ఈ కేసులో సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన ఉన్న తీహార్ జైలులోనే ఈడీ విచారణ చేసి, అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు వినిపించాయి. ఈ కేసులో అరెస్టైన రామచంద్రపిళ్లై అప్రూవర్ గా మారారు. సత్యేంద్రజైన్, మనీష్ సిసోడియాలు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ యేడాది త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిల్లో త్రిపుర, నాగాలాండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ గెలిచింది. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేఘాలయాలో హంగ్ ఏర్పడగా, మిజోరాంలో స్థానిక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా అనర్హుడిగా ప్రకటించారు. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై ఆయనపై పరువు నష్టం దావా వేశారు. దీనిమీద సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ తీర్పు వెలువడడంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం తొలగించారు. దీనిమీద రాహుల్ గాంధీ గుజరాత్ హై కోర్టుకు వెళ్లగా, కొట్టివేసింది. ఆ తరువాత దీనిమీద రాహుల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ సుప్రీకు వెళ్లారు. సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్ పై స్టే విధించింది.
2023 మేలో మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య జాతి హింస చెలరేగింది. కనీసం 73 మంది చనిపోయారు. ఆ తరువాత మణిపూర్‌లోని ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, కఠోరమైన లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై ప్రతిపక్షాల వాకౌట్ ల మధ్య అటవీ భూమిని భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మళ్లించడానికి అనుమతించే అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆ తరువాత సెప్టెంబర్ లో మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. ఇద్దరు మెయిటీ విద్యార్థుల హత్యపై నిరసనల సందర్భంగా జరిగిన అల్లర్లలో 80 మందికి పైగా గాయపడ్డారు.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 3 విజయవంతమయ్యింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి అంతరిక్ష యాత్రగా రికార్డ్ సృష్టించింది. చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగిపోయిది.
మహిళా రిజర్వేషన్ బిల్లు, 2023 (నారీ శక్తి వందన్ అభియాన్), పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం నేరుగా ఎన్నికైన లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరింది.సెప్టెంబర్ 20 - లోక్‌సభ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు వచ్చాయి. రాజ్యసభ బిల్లును ఏకగ్రీవంగా 214 ఓట్లతో ఆమోదించింది. రాష్ట్రపతి ముర్ము బిల్లుపై సంతకం చేశారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ టన్నెల్ కూలడంతో 41మంది కులీలు చిక్కుకుపోయారు. పదిహేడు రోజుల తరువాత వారందరినీ సురక్షితంగా బైటికి తీసుకువచ్చారు. ర్యాట్ హోల్ మైనర్లతో డ్రిల్లింగ్ చేపట్టి ఏర్పాటు చేసిన గొట్టం ద్వారా 41మందిని సురక్షితంగా బైటికి తీసుకు వచ్చారు. రెస్క్యూ టీం కృషిని ప్రధాని మోడీ అభినందించారు.