Asianet News TeluguAsianet News Telugu

Mahadev App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ నుంచి భుపేశ్ బఘేల్ వరకు.. ఈ స్కాం ఏమిటీ? సీఎంకు ఏమిటీ సంబంధం?

ఛత్తీస్‌గడ్ ఎన్నికల క్యాంపెయిన్‌లో అనూహ్య మార్పు వచ్చింది. అన్ని పార్టీలు మహాదేవ్ యాప్ కేసు గురించి మాట్లాడుతున్నాయి. సీఎం భుపేశ్ బఘేల్‌పై ఆరోపణలు రావడంతో ఈ కేసు గురించి ఆసక్తి నెలకొంది. మహాదేవ్ యాప్ కేసు గురించి కీలక విషయాలు తెలుసుకుందాం.
 

mahadev app betting case, allegations on chhattisgarh cm bhupesh baghel, know key details of case kms
Author
First Published Nov 4, 2023, 5:20 PM IST

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ ఎన్నికల ముంగిట్లో అక్కడ మహాదేవ్ యాప్ కేసు సంచలనం రేపుతున్నది. ఈ కేసులో సీఎం భుపేశ్ బఘేల్ పేరు కూడా వినిపించడంతో రాజకీయ దుమారం మొదలైంది. అసలే ఎన్నికల వేళ.. క్యాంపెయిన్ జోరుగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ లీడర్, సీఎం బఘేల్ పేరు రావడంతో రాష్ట్రాన్ని ఈ అంశం కుదిపేస్తున్నది. ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ అధికారాన్ని పొందుతామనే ధీమాలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ కేసు అశనిపాతంగా మారింది. రూ. 508 కోట్ల ముడుపులు సీఎం భుపేశ్ బఘేల్‌కు ఈ యాప్ ప్రమోటర్లు పంపించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పేర్కొనడంతో ఈ రాజకీయ దుమారం రేగింది. ఈ కేసు గురించిన కీలక విషయాలు తెలుసుకుందాం.

మహదేవ్ యాప్ హై ప్రొఫైల్ స్కాం. పోకర్, కార్డ్ గేమ్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్, క్రికెట్ సహా అనేక గేమ్స్‌లలో గ్యాంబ్లింగ్‌కు దోహదపడే ఆన్‌లైన్ బెట్టింగ్‌ను రన్ చేస్తుంది. ఈ యాప్‌ను గతంలో జ్యూస్‌లు అమ్మిన సౌరభ్ చంద్రాకర్, ఆయన మిత్రుడు రవి ఉప్పల్‌లు ఇద్దరూ దుబాయ్ నుంచి నడుపుతున్నారు. వీరిద్దరూ ఛత్తీస్‌గడ్‌కు చెందినవారని ఈడీ వెల్లడించింది.

ఈడీ అభియోగాల ప్రకారం, ఈ యాప్ తెలిసిన వ్యక్తులకు 70-30 నిష్పత్తిలో ప్రాఫిట్లతో ప్యానెల్ లేదా బ్రాంచీలుగా ఫ్రాంచైజీలు ఇస్తుంది. ఆ ప్లాట్ ఫామ్‌తో కొత్త యూజర్లను ఎన్‌రోల్ చేసుకోవడం, ఐడీలు సృష్టించడం, బినామీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా సంక్లిష్టమైన నెట్‌వర్క్ ద్వారా మనీ లాండర్ చేయడం  వంటివి చేస్తుంది. ఈ ఆపరేషన్ ద్వారా రోజుకు రూ. 200 కోట్లు జనరేట్ చేస్తున్నది. గేమ్స్‌లో రిగ్గింగ్ చేసి ప్యానెల్ ఓనర్లు లబ్ది పొంది ప్లేయర్లు నష్టపోతారు.

Also Read: అంబానీకి బెదిరింపుల కేసు.. 19 ఏళ్ల తెలంగాణ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

చంద్రాకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో వైభవంగా, రూ. 250 కోట్లతో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి బాలీవుడ్ యాక్టర్లు రణబీర్ కపూర్, శ్రద్దా కపూర్, హుమా ఖురేషీ, కపిల్ శర్మ, బొమన్ ఇరానీ, హీనా ఖాన్, టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్‌లు హాజరయ్యారు. పాపులర్ సింగర్స్ నేహ కక్కార్ సహా పలువురు పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. వీరు ఆ పెళ్లిలో పాల్గొనడానికి, లేదా పర్ఫార్మ్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బును స్వీకరించి ఉంటారనే అనుమానాలు ఈడీ చేస్తున్నట్టు సమాచారం. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిన ఈ పెళ్లిపై ఈడీ అధికారులు చూపుసారించగా పలు భారత నగరాల్లో హవాలా ఆపరేటర్ల లింక్ బయటపడింది. దీంతో రూ. 417 కోట్ల అటాచ్ చేసింది.

చంద్రాకర్ సుమారు రూ. 5,000 కోట్లు సంపాదించినట్టు తెలిసింది. గోవా, మంబయి, విశాఖపట్నం, అహ్మదాబాద్, ఛత్తీస్‌గడ్‌లలో ఈ గేమ్ బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కనీసం ఏడు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 21వ తేదీన ఈడీ తొలి చార్జిషీటు ఫైల్ చేసింది. చంద్రాకర్, ఉప్పల్ సహా 14 మంది నిందితుల పేర్లు అందులో ఉన్నాయి.

అయితే.. సీఎం బఘేల్‌కు మహాదేవ్ యాప్ ప్రమోటర్లు రూ. 508 కోట్లు చెల్లించినట్టు ఓ క్యాష్ కొరియర్ ఈమెయిల్ స్టేట్‌మెంట్‌ కేసులో సంచలన మలుపు తిప్పింది. ఛత్తీస్‌గడ్ సీఎం ఈ ఆరోపణలను కొట్టివేశారు. ఎన్నికల వేళ తన ఇమేజ్‌ను డ్యామేజీ చేయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios