Dalit వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురు అని కూడా చూడకుండా  head shave and holy bath చేయించాడు.  ఇక తండ్రి వేధింపులు తట్టుకోలేని సాక్షి  యాదవ్  ఇంట్లో నుంచి పారిపోయి  భర్త దగ్గరికి చేరుకుంది. శుక్రవారం ఆ మహిళా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పి)  ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. 

భోపాల్ : కులం, సామాజిక హోదా, పరువు ప్రతిష్టలు అంటూ దారుణాలకు ఒడిగడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. సొంత పిల్లల్నే చంపుకుంటూ పరువు హత్యలకు తెగబడుతున్నారు. అల్లారుముద్దుగా పెంచిన కూతురు అని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. 

ఇంత చేసీ చివరకు అటు కూతురుకు దూరమై, ఇటు సమాజంలో నేరస్తుడిగా ముద్రపడి ఎటూ కాకుండా పోతున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తున్నా, వింటున్నా.. పర్యవసానాలు తెలిసినా.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

పరువు కోసం కన్న కూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఇతర కులం వాడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని కన్న కూతురుని, ఆమె కట్టుకున్న వాడిని murder చేస్తున్నారు. అయితే తాజాగా ఓ father మాత్రం కూతురు తన cast కాని వాడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురికి గుండు కొట్టించి, పుణ్య స్నానం చేయించాడు.

ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో చోటు చేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోప్నాకు చెందిన సాక్షి యాదవ్ (24) హాస్టల్లో ఉంటూ నర్సింగ్ చదువుతోంది. అదే కాలేజీలో తనతో పాటు చదివే అమిత్ అహిర్వాల్‌తో తనకు పరిచయం ఏర్పడింది.

అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని పట్టణంలోనే కాపురం పెట్టారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంట్లో తను వివాహం చేసుకున్న విషయం చెప్పడంతో ఆమె తండ్రి ఒప్పుకోకపోతే కోపంతో రగిలిపోయాడు.

ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడగా యువతి తండ్రి వివాహానికి ఒప్పుకుంటున్నట్లు నమ్మ బలికాడు. అయితే ఇదే క్రమంలో ఇటీవల సాక్షి యాదవ్ను తన హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి harassment చేయసాగాడు.

భార్య కోరుకున్న వ్యక్తితో దగ్గరుండి ఆమె పెళ్లి చేయించిన భర్త.. అసలేం జరిగిందంటే..

Dalit వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురు అని కూడా చూడకుండా head shave and holy bath చేయించాడు. ఇక తండ్రి వేధింపులు తట్టుకోలేని సాక్షి యాదవ్ ఇంట్లో నుంచి పారిపోయి భర్త దగ్గరికి చేరుకుంది. శుక్రవారం ఆ మహిళా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పి) ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. 

2020 మార్చిలో తాను దళిత వ్యక్తిని వివాహం చేసుకున్నానని, జనవరి 4, 2021న తన నాన్నకు విషయం తెలియజేశాను అని తెలిపింది. అయితే తన తండ్రి 2021 జనవరిలో తాను కనిపించడం లేదని Missing compliant దాఖలు చేశారని.. తనకు తండ్రి నుంచి ప్రాణహాని ఉందని ఆ యువతి పోలీసులకు తెలిపింది.

అంతే కాక తన భర్తకు విడాకులు ఇవ్వాలని, తమ కులం వ్యక్తితో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని.. తమకు రక్షణ కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.