Asianet News TeluguAsianet News Telugu

అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదని భార్యను తెగనరికాడు...!

అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదన్న కోపంతో భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త.  మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా హీరాపూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.  

Madhya Pradesh Man Kills Wife For Delay In Giving Him Towel After Bath
Author
Hyderabad, First Published Nov 9, 2021, 8:03 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలాఘాట్ : చిన్న చిన్న విషయాలకే భార్యభర్తల మధ్య గొడవలు రావడం మామూలు. అయితే ఆ గొడవలు కాసేపటికి సద్దుమణుగుతాయి. మామూలుగా అయిపోతారు. కానీ చిన్న విషయానికే పట్టరాని కోపంతో భార్యనే హత్య చేశాడో భర్త. తాను అడిగినప్పుడు ఇవ్వలేదని.. తనకు సేవలు చేయలేదన్న ఈగోతో భార్యను అంతమొందించాడు. 

హత్యకు అసలు కారణం వింటే ఆశ్చర్యంతో పాటు.. ఇంత చిన్న వాటికి చంపుకుంటూ పోతే సమాజంలో నేరాల రేటు ఏ రీతిన పెరుగుతుందన్న భయమూ కలుగుతుంది. అసలేం జరిగిందంటే...

అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదన్న కోపంతో భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త.  మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా హీరాపూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.  

నిందితుడు అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్న రాజకుమార్ బాహేగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్నానం ముగించుకున్న రాజకుమార్… భార్య పుష్ప బాయ్ (45)ను Towel అడిగాడు. ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని కాసేపు ఆగాలి అని ఆమె చెప్పింది.  

కొన్ని నిముషాల తర్వాత husbandకి టవల్ అందించింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న రాజ్ కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య తలపై attack చేశాడు. అడ్డువచ్చిన కుమార్తెను బెదిరించాడు. దాడిలో తీవ్రంగా Injured పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

నా బిడ్డను కాపాడండి.. ఆమె నా లోకం.. అయ్యో ఎంత కష్టం వచ్చింది తల్లి..

ఢిల్లీలో భార్యపై భర్త అరాచకం.. కోర్టు ఏమందంటే....

అతను ఓ తాగుబోతు. కనీసం కుటుంబాన్ని కూడా పట్టించుకోడు. విపరీతంగా మద్యం సేవించి.. భార్యను హింసించేవాడు. కనీసం ఆమెను ఓ మనిషిగా కూడా గుర్తించేవాడు కాదు. కానీ.. ఎప్పుడైతే భార్యకు మంచి ఉద్యోగం వచ్చిందో.. అప్పటి నుంచి ఆమె పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టాడు. ఆమె డబ్బుపై అతని కన్నుపడింది. ఆ డబ్బు కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో.. ఆ బాధలు భరించలేక.. బాధితురాలు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాగా.. భార్యను కేవలం డబ్బులు తీసుకువచ్చే కామధేనువుగా  భర్త భావిస్తున్నాడని.. అలాంటి బంధం అవసరం లేదని భావించిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు  చేయడం గమనార్హం. భర్త.. తన భార్యపట్ల మానసికంగా క్రూరంగా ప్రవర్తించాడని.. అందుకే విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

ఆమె పట్ల అప్పటి వరకు ఎలాంటి ప్రేమ చూపించలేదని.. ఎప్పుడైతే భార్యకు ఢిల్లీ పోలీస్ అకాడమీలో ఉద్యోగం సాధించిన తర్వాత.. ఆమె తీసుకువచ్చే జీతం పట్ల సదరు భర్త ఆసక్తి చూపిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

బాధితురాలికి దాదాపు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వివాహం అయ్యింది. ఆ సమయంలో ఆమె భర్త వయసు 19 సంవత్సరాలు. కాగా.. వీరి వివాహం 2005లో జరిగింది. అయితే.. కట్నం కావాలంటూ.. ఆమె ను 2014 వరకు కనీసం అత్తారింటికి భర్త తీసుకువెళ్లకపోవడం గమనార్హం. ఆమె పుట్టింట్లోనే ఉండి.. కష్టపడి.. చదివి ఉద్యోగం సంపాదించింది. ఆమె ఉద్యోగం సంపాదించిది అని తెలియగానే.. వచ్చి ఆమెను అత్తారింటికి తీసుకువెళ్లాడు.

ఆమె జీతంతో జల్సాలు చేస్తూ.. కనీసం ఎలాంటి ఉద్యోగం చేయకుండా ... నిత్యం మద్యం సేవించి.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. నిత్యం వేధింపులు ఎక్కువ అవుతుండంతో.. భరించలేకపోయిన బాధితురాలు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. మొత్తం కేసును పరిశీలించిన న్యాయస్థానం.. విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అని భావించింది. దీంతో.. వారికి విడాకులు మంజూరు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios