Asianet News TeluguAsianet News Telugu

నా బిడ్డను కాపాడండి.. ఆమె నా లోకం.. అయ్యో ఎంత కష్టం వచ్చింది తల్లి..

ఓ తల్లి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కూతురిని బతికించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఆమె వద్ద ఉన్న మొత్తం, ఉంటున్న స్థలం అమ్మిన డబ్బును కూడా కూతురి చికిత్స కోసమే ఖర్చు చేసింది. చివరకు తన వద్ద కూడా డబ్బులు అయిపోవడంతో.. తన కూతురిని బతికించడానికి సాయం చేయాలని దాతలను వేడుకుంటుంది.

My Child Bhulakshmi Is diagnosed with severe aplastic anemia please help
Author
Hyderabad, First Published Nov 8, 2021, 6:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రపంచంలో ఏ తల్లైన తన పిల్లల కోసమే బతుకుతుంది. వారికి ఏదైనా కష్టం వస్తే.. తన గుండె తల్లడిల్లి‌పోతుంది. కూతురి కోసం ఆదా చేసిన డబ్బులను మొగుడు తాగడానికి ఖర్చు చేశాడు. అది ప్రశ్నించిన ఆమెను ఎటువంటి కనికరం లేకుండా వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అయితే పాపే లోకంగా బతుకుతున్న ఆ తల్లికి ఊహించని కష్టం వచ్చింది. పాపకు ప్రాణాంతక క్యాన్సర్‌ ఉందని తెలిసి గుండెలు పగిలేలా రోదించింది. తన కూతురిని బతికించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఆమె వద్ద ఉన్న మొత్తం, ఉంటున్న స్థలం అమ్మిన డబ్బును కూడా కూతురి చికిత్స కోసమే ఖర్చు చేసింది. చివరకు తన వద్ద కూడా డబ్బులు అయిపోవడంతో.. కూతురి చికిత్సకు అయ్యే ఆర్థిక సాయం సేకరించడానికి మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టోను ఆశ్రయించింది. తన కూతురే తనకు ప్రపంచం అని.. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేని.. దయచేసి సాయం చేయాలని వేడుకుంటుంది.

ఆ తల్లి పడుతున్న కష్టం ఆమె మాటల్లోనే.. ‘నా భర్త మద్యానికి బానిసగా మారాడు. నేను నా కుటుంబం గురించి కష్టపడేదానిని. కానీ నా భర్త మాత్రం నేను సంపాదించిన డబ్బును చెడు అలవాట్లకు ఖర్చుచేసేవాడు. ఇంట్లో రోజు గొడవలే. కానీ ఎంత కష్టం ఉన్నా నా కూతురు భూలక్ష్మి కోసం అవన్నీ భరించేవాడిని. కూతురు కోసం సంపాదించిన డబ్బులను కూడా నా భర్త తాగడానికి ఖర్చుచేసేవాడు. ఇలా అంతా ఖర్చు చేసి.. చివరకు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయితే నేను మాత్రం నా కూతురికి అందమైన జీవితాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. ఆమెను సంతోషంగా ఉంచడానికి నేను చేయాల్సింది అంతా చేశారు. (సాయం చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి)

అయితే నా కూతురు కూడా నన్ను అర్థం చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలిని. ఎన్ని కష్టాలు ఉన్నా.. నా కూతురి నవ్వు కోసమే నేను బతుకుతున్నా.. నేను ఉపాధి కోసం చాలా చోట్ల వెతికాను.. కానీ చివరకు రోజు వారీ కూలీగా చేరాను. రోజుకు రూ. 200 మాత్రమే వచ్చేవి. దీంతో అవసరాలు తీరడం కష్టంగా మారింది. కానీ నా కూతురికి తిండి పెట్టి, బడికి పంపేదానిని. నా బిడ్డ మంచి జీవితం గడపాలనే ఆశ నన్ను ముందుకు నడిపించింది. 

My Child Bhulakshmi Is diagnosed with severe aplastic anemia please help

కానీ నేను ఒక రోజు ఇంటికి వచ్చేసరికి నా కూతురు అపస్మారక స్థితిలో కనిపించింది. నేను వెంటనే చుట్టుపక్కల వాళ్ల సాయంతో పాపను స్థానిక క్లినిక్‌కు తరలించాను. అక్కడ రక్తపోటు అసాధారణంగా ఉందని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ నాకు చెప్పాదు. దీంతో సమయం వృథా చేయకుండా నేను పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ పాపకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్లాస్టిక్‌ ఎనిమీయా అనే ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా తేల్చారు. దీంతో నాకు నోట మాట రాలేదు. పాపే ప్రపంచంగా బతుకుతున్న నాకు.. ఈ విషయం కన్నీరు పెట్టించింది. చికిత్సకు అయ్యే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు. కానీ పాపను బతికించుకోవాలనే ప్రయత్నాలను మొదలుపెట్టాను.

ఏడాది కాలంగా నా కూతురుకు ఆస్పత్రిలో క్రమం తప్పకుండా రక్తమార్పిడి జరుగుతోంది. నేను నా చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేశాను.. మేము ఉంటున్న స్థలాన్ని కూడా అమ్మేశాను. ఇప్పటివరకు మొత్తం రూ. 16 లక్షలు పాప చికిత్స కోసం ఖర్చు చేశాను. అయితే ఇప్పుడు.. నా బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ఎముక మజ్జ మార్పిడి (bone marrow transplant) కోసం అదనంగా రూ. 30 లక్షలు ($ 39951.78) అవసరమని డాక్టర్లు నాకు చెప్పారు. (సాయం చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి)

ఇప్పుడు నేను ఉండటానికి ఇళ్లు కూడా లేకపోవడంతో ఆస్పత్రి బయటే వీధుల్లో నివసిస్తున్నాను. ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి. కానీ నా బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ చికిత్సకు అయ్యే డబ్బులు నా వద్ద లేవు. అందుకే నాకు సాయం చేయండి. నా బిడ్డను రక్షించడానికి విరాళం ఇవ్వండి అని వేడుకుంది. 

సాయం చేయాలని అనుకునేవారు ఇక్కడ డొనేట్ చేయండి..

Follow Us:
Download App:
  • android
  • ios