Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ క్రైసిస్: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా

మధ్యప్రదేశ్ లోని కాంగ్రెసు ప్రభుత్వం కూలడం ఖాయమైంది. 20 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా సింథియా వర్గానికి చెందినవారు.

Madhya Pradesh crisis: 19 MLAs resign including six ministers
Author
Bhopal, First Published Mar 10, 2020, 1:38 PM IST

భోపాల్: మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం కూలడం ఖాయమైంది. ఇప్పటి వరకు 19 మంది కాంగ్రెసు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వారు గవర్నర్ కు పంపించారు. 

జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన వెంటనే 14 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు సమర్పించగా, ఆ తర్వాత మరో ఐదుగురు రాజీనామా చేశారు. దీంతో రాజీనామాలుచేసిన కాంగ్రెసు ఎమ్మెల్యేల సంఖ్య 19కి చేరింది. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు.మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

 

కాంగ్రెసు శాసనసభ్యులను రాజీనామా దిశగా నడిపించడంలో నరోత్తమ్ మిశ్రా కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. సంక్షోభాన్ని సృష్టించడంలో ఆయనే ప్రధాన పాత్ర పోషింంచినట్లు చెబుతున్నారు.

Also Read: సింథియాకు బిజెపి ఆఫర్ ఇదే: మైనారిటీలో కమల్ నాథ్ ప్రభుత్వం

కాంగ్రెసులో ఉన్నప్పుడు సింథియాను మహారాజు అన్నారని, ఇప్పుడు మాఫియా అంటున్నారని, ఇది కాంగ్రెసు ద్వంద్వ నీతికి నిదర్శనమని బిజెపి నేత శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. 

కాంగ్రెసు ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్యప్రదేశ్ శాసనసభలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ కూడా తగ్గిపోతుంది. కాంగ్రెసు ఎమ్మెల్యేల సంఖ్య ఘోరంగా పడిపోతుంది. దాంతో 107 మంది సభ్యులు గల బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం ఏర్పడుతుంది. 

Also Read: కమల్ నాథ్ అవుట్: ఎంపీ లోనూ కర్ణాటక ఫార్ములా, లెక్కలు ఇవీ!

Follow Us:
Download App:
  • android
  • ios