ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు.. ప్రజల ముందుకు వస్తారు: నెడుమారన్ సంచలన వెల్లడి

ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ పార్టీ వెల్లడించింది. ఆయన సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని, ప్రత్యేక తమిళ్ ఈలం ఏర్పాటుకు ఆయన వద్ద ఉన్న స్పష్టమైన ప్రణాళికను వెల్లడిస్తారని ఆ పార్టీ ప్రెసిడెంట్ పీ నేదుమారన్ సంచలన ప్రకటన చేశారు.
 

ltte leader velupillai prabhakaran alive startling reveletions made by tnm leader p nedumaran

చెన్నై: శ్రీలంకలో గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించిన ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ సంచలన ప్రకటన చేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈలం (ఎల్‌టీటీఈ) నేత వేలుపిళ్లై ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని టీఎన్ఎం లీడర్ పీ నెడుమారన్ వెల్లడించారు. వరల్డ్ తమిళ్ కాన్ఫడరేషన్ వ్యవస్థాపకుడు, తమిళ్ నేషనలిస్టు మూవ్‌మెంట్ అధ్యక్షుడు పీ నేదుమారన్.. ప్రభాకర్ గురించి మాట్లాడారు. ఇన్నాళ్లు ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థ చేసిన తప్పుడు ప్రచారానికి తాను తెర దించుతున్నట్టు తెలిపారు. ఆయన త్వరలోనే తన ప్లాన్ వెల్లడిస్తారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులందరూ ఆయనకు మద్దతు తెలపాలని కోరారు.

ప్రభాకరన్ ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబం ప్రభాకరన్‌తో టచ్‌లో ఉన్నదని అన్నారు. అయితే, ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని, ఆయన లొకేషన్‌ను తాను ఇప్పుడే వెల్లడించాలేనని తెలిపారు. తాను ఈ ప్రకటన ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతితోనే చేస్తున్నట్టూ చెప్పారు.

ప్రస్తుతం శ్రీలంక ఆందోళనలు చెలరేగుతున్నాయని, ప్రభాకరన్‌ను బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని నేదుమారన్ వివరించారు. ప్రభాకరన్ సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని, ప్రత్యేక తమిళ్ ఈలంను ఏర్పాటు చేయడానికి తన వద్ద ఉన్న స్పష్టమైన ప్రణాళికలను తెలియపరుస్తారని పేర్కొన్నారు.

శ్రీలంకలో మే 2009లో మొత్తం తమిళులను హననం చేయడానికి యుద్ధం జరిగింది. ఇందులో ఎంతోమంది అమాయక లంకన్ తమిళులు మరణించారు. ఈ యుద్ధ అంత్య దశలో ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ మరణించినట్టు ప్రకటించారు.

Also Read: ఉరిశిక్షకు సిద్ధం కావాలని ఏడు సార్లు ఆదేశాలు.. వారు నాకోసం ఎదురుచూశారు కూడా: నళిని

శ్రీలంకన్ తమిళులకు ప్రత్యేక తమిళ్ ఈలం ఏర్పాటు కోసం ఎల్‌టీటీఈ పోరాడింది. వీరిపై యుద్ధాన్ని జాతిహననంగా ఈలం మద్దతు పార్టీలు పేర్కొన్నాయి. అంతేకాదు, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే యుద్ధ నేరాలకు గాను అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోవాలని భావించాయి.

నేదుమారన్ వ్యాఖ్యలపై మాజీ శ్రీలంక ఎంపీ శివాజిలింగమ్ స్పందించారు. అప్పుడు ప్రభాకరన్ మరణించాడని లంక ప్రభుత్వం చూపించిన డెడ్ బాడీ నిజంగా ప్రభాకరన్‌దే అని ఇప్పటికీ నిరూపించలేదని వివరించారు.

ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని చెప్పడం నేదుమారన్ వ్యక్తిగత అభిప్రాయం అని, కానీ, ఆయన అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఉండలేమని వివరించారు. అదే నిజమైతే గనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ఎంతో సంతోషంగా ఉంటారని తెలిపారు. అసలు యుద్ధమే లేకుండా తమిళ్ ఈలం ఏర్పాటు చేసే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. తమిళగ వళ్వురిమై కాచి వ్యవస్థాపకుడు టీ వేలుమురుగన్, ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభావకర్ బ్రతికే ఉన్నారనే వార్త హ్యాపీ, స్వీట్ న్యూస్ అని పేర్కొన్నారు.

Read in Tamil: விடுதலை புலிகள் தலைவர் பிரபாகரன் நலமுடன் உள்ளார்.! விரைவில் வெளியே வருவார்- பழ.நெடுமாறன் பரபரப்பு தகவல்

Read In English: LTTE chief Prabhakaran alive, will appear before public soon: Ex-Congress leader Nedumaran's massive claim

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios