ఉరిశిక్షకు సిద్ధం కావాలని ఏడు సార్లు ఆదేశాలు.. వారు నాకోసం ఎదురుచూశారు కూడా: నళిని

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత విడుదలైన ఆరుగురిలో ఒకరైన నళిని జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. తనకు ఏడుసార్లు బ్లాక్ వారెంట్లు వచ్చాయని, ఉరి తీయడానికి వారు ఎదురు చూశారు కూడా అని తెలిపారు. కానీ, ఆ శిక్షలు అమలు కాలేదని నిట్టూర్చారు.
 

i received seven times execution orders, they waited for me says rajiv gandhi case convict nalini sriharan

న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన నళిని శ్రీహరన్ ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుగురిని కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన మరుసటి రోజు వారు జైలు నుంచి విడుదలయ్యారు. రాజీవ్ గాంధీ హత్య కుట్రలో పాత్ర ఉండటంపై పశ్చాత్తాపపడుతున్నారా? అని అడగ్గా.. అందులో తన అమాయకత్వాన్ని వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో తన పాత్ర లేదని అన్నారు. తాను ఈ కేసులో దోషిగా తేల్చిన మాట వాస్తవమే కానీ, నా మనస్సుకు అన్నీ తెలుసు అని వివరించారు.

వారు తన భర్త ఫ్రెండ్స్ అని తెలిపారు. వారితో తనకు కొంత పరిచయం ఉన్నదని, థియేటర్లు, దేవాలయాలు, హోటల్స్‌కు వెళ్లడానికి సహకరించానని వివరించారు. అంతకు మించి వారి గురించి, వారి కుటుంబ వివరాలేమిటో కూడా తనకు తెలియదని అన్నారు. తొలుత నళినికి ఉరి శిక్ష పడింది. సోనియా గాంధీ చొరవతో ఈ శిక్ష యావజ్జీవంగా మారింది. ఉరి శిక్ష అమలు గురించి నళిని కీలక విషయాన్ని వెల్లడించారు.

వారు నాకు ఏడు సార్లు బ్లాక్ వారెంట్ (ఉరిశిక్షకు ఆదేశాలు) పంపారని అన్నారు. ఉరి తీయడానికి వారు నాకోసం ఎదురుచూసేవారని వివరించారు. కానీ, ఆ శిక్ష అమలు కాలేదని తెలిపారు. ఉరి శిక్ష అమలుకు ఆదేశాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారని అడగ్గా.. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేమని, అది చాలా దుర్భరమైన స్థితి అని చెప్పారు.

Also Read: రాజీవ్ గాంధీ హత్య కేసు: జైలు నుంచి బయటకు వచ్చిన నళిని ఫస్ట్ కామెంట్ ఇదే.. ప్రజా జీవితంపై కీలక వ్యాఖ్య

ఇదే సందర్భంలో ఆమె ప్రియాంక గాందీ గురించి ప్రస్తావించారు. రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ తనను కలవడానికి జైలుకు వచ్చారని గుర్తు చేసుకున్నారు. తమకు జైలులో ఏ మాత్రం గౌరవం ఉండేది కాదని, ఏ అధికారులు వచ్చినా లేచి నిలబడి మాట్లాడించేవారని తెలిపారు. కానీ, ప్రియాంక గాంధీ చాలా సున్నితమైన మనిషి అని, ఆమె వచ్చిన తర్వాత తనకు తాను గౌరవించుకోవడం పెరిగిందని చెప్పారు. ఆమె నిజంగా దేవదూత వంటి వారని తెలిపారు. ఆమె తన తండ్రి హత్య గురించి అడిగారని చెప్పారు. ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారని పేర్కొన్నారు. ఆమె ఏడ్చేసింది కూడా అని వివరించారు.

ఆమె కూతరు హరిత్ర గురించి కూడా మాట్లాడారు. జైలుకు వెళ్లిన తర్వాత నళినికి 1992లో హరిత్ర జన్మించారు. ఆమె ఇప్పుడు లండన్‌లో డాక్టర్. ఆమె జన్మించిన రెండేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు పంపించారు. బయటే పెంచారు. 2019లో హరిత్ర పెళ్లి చేసుకున్నప్పుడు నళినికి ఒక నెల రోజుల పెరోల్ ఇచ్చారు.

‘ఆమె నన్ను పూర్తిగా మర్చిపయింది. ఆమెకు నేనే జన్మనిచ్చా, కానీ, రెండేళ్ల తర్వాత ఆమె నుంచి నన్ను పూర్తిగా వేరు చేశారు. ఆమెన బయటకు పంపించిన తర్వాత నన్ను ఆమె పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు మేం అన్నింటినీ రికవరీ చేసుకుంటున్నాం’ అని నళిని వివరించారు. ‘ఇది నాకు, ఆమెకు చాలా కష్టమైన పని. మేం మెచ్యూర్ కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ, ఆమె చాల చిన్నది కదా.. అందుకే ఆమె అంత సులువుగా అర్థం చేసుకోవడం కష్టమే. అందుకే ఆమె బాధ పడుతున్నది. అందుకే ఇది నా కూతురికి చాలా కష్టం’ అని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios