ఆమెకు వేరొకరి(marriage)తో పెళ్లి అయిపోయింది. కానీ ఓ రోజు రాత్రి అనుకోకుండా మాజీ ప్రియుడు (Ex Lover) నుంచి ఫోన్ వచ్చింది. ఆమెను కలవాలని ఉందని, ఒక్కసారి కలవమని కోరాడు. అయితే దానికి ఆమె ముందు అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతను వదిలిపెట్టలేదు.
మధ్యప్రదేశ్ : ప్రేమించుకోవడం..విడిపోవడం.. ఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు కావడం చాలా మామూలుగా.. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ జరిగేవే. అయితే కొన్నిసార్లు ఇవి మరీ దారుణంగా తయారవుతాయి. తనను మోసం చేశాడనో, లేక చేసిందనో కక్ష పెట్టుకున్న ప్రేమికురాలు, లేదా ప్రేమికుడు వారిమీద అఘాయిత్యానికి పూనుకుంటారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఆమెకు వేరొకరి(marriage)తో పెళ్లి అయిపోయింది. కానీ ఓ రోజు రాత్రి అనుకోకుండా మాజీ ప్రియుడు (Ex Lover) నుంచి ఫోన్ వచ్చింది. ఆమెను కలవాలని ఉందని, ఒక్కసారి కలవమని కోరాడు. అయితే దానికి ఆమె ముందు అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతను వదిలిపెట్టలేదు. ఒక్కసారి కలవమంటూ చాలా బ్రతిమిలాడాడు. చివరికి ఆ యువతి కరిగింది. అతన్ని కలవడానికి రాత్రి 11 గంటలకు స్నేహితురాలిని వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత.. తన కోసం అంత సాహసం చేసిన ప్రియురాలి పట్ల ఆ ప్రియుడు చేసిన నిర్వాకం ఏంటంటే…
ఇండోర్లోని ఫిర్దోస్ నగర్ కు చెందిన అల్లు షేక్ గతంలో రుక్సానా అనే యువతిని ప్రేమించాడు. అయితే ఇతర కారణాల వల్ల ఆమెకు వేరొకరితో వివాహం అయిపోయింది. కొద్దిరోజుల తర్వాత అతడు ఆమెకు ఫోన్ చేసి ఒకసారి కలవాలని బయటికి రమ్మని కోరాడు. దానికి మొదట ఆమె నిరాకరించిన… అతడు బతిమిలాడేసరికి చివరకు ఒప్పుకుంది. సోమవారం రాత్రి 11 గంటలకు రుక్సానా, తన స్నేహితురాలు అఫ్సానాని వెంటబెట్టుకుని వెళ్ళింది.
రాజ్‌బారా చౌపట్టి దగ్గర వారిద్దరూ అల్లుని కలిశారు. అక్కడ అల్లు, రుక్సానా మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో అతడు వెంట తెచ్చుకున్న కత్తితో రుక్సానాపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన అఫ్సానాని కూడా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో రుక్సానా కాలిపై రెండు గాయాలవగా, అఫ్సానా చేతికి గాయం అయింది. తర్వాత నిందితుడే గాయపడ్డ వారిద్దరినీ ఎంవై ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు దొంగతనం కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అల్లు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
