Asianet News TeluguAsianet News Telugu

Ayodhya : ‘దేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటించకపోతే.. సరయూనదిలో జల సమాధి అవుతా..’ కేంద్రానికి జగద్గురుహెచ్చరిక..

తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తాను జల సమాధి చేసుకుంటానని మహారాజ్ బెదిరించారు. ‘అక్టోబర్ రెండవ తేదీలోపు భారత దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.  లేదంటే నేను సరయూ నదిలో  జల సమాధి చేసుకుంటాను’  అని అయోధ్యలో జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్  చెప్పారు.

Declare India a Hindu Rashtra : Ayodhya Mahant Writes Letter to President, Threatens to End Life If 7 Demands Not Met
Author
Hyderabad, First Published Sep 29, 2021, 10:30 AM IST

న్యూ ఢిల్లీ : జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ కేంద్ర ప్రభుత్వానికి (Central Governament) సంచలన హెచ్చరిక (Threaten) జారీ చేశారు.  మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబర్ 2వ తేదీ నాటికి భారత దేశాన్ని హిందూ రాజ్యంగా (Declare India a Hindu Rashtra)ప్రకటించాలని చవానీకి చెందిన ప్రముఖ తపస్వి జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ (Ayodhya Mahant)  డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తాను జల సమాధి చేసుకుంటానని మహారాజ్ బెదిరించారు. ‘అక్టోబర్ రెండవ తేదీలోపు భారత దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.  లేదంటే నేను సరయూ నదిలో  జల సమాధి చేసుకుంటాను’  అని అయోధ్యలో జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్  చెప్పారు.

మలద్వారంలో రూ.42 లక్షల విలువైన బంగారం దాచి స్మగ్లింగ్.. ఎక్స్ రేలో షాకింగ్ విషయం.. !

 భారత దేశంలోని ముస్లింలు క్రైస్తవులు జాతీయతను రద్దు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని జగద్గురుపరమహంస ఆచార్య మహారాజ్ డిమాండ్ చేశారు.  పరమహంస ఆచార్య గత 15 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.  అప్పట్లో కేంద్ర హోం శాఖ మంత్రి నుంచి హామీ లభించిన తర్వాత  ఆయన నిరాహార దీక్ష విరమించారు.

 జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ చేసిన డిమాండ్లకు మద్దతుగా హిందూ సనాతన ధర్మ సంసద్  నిర్వహిస్తామని అయోధ్య లోని  సాధువు సంఘం తెలిపింది.  2022 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios