ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి.. శారీరకంగా దగ్గరైన మేనబావ.. ఆ తరువాత మొహం చాటేశాడు. దీంతో ఆమె అతని ఇంటిముందు ధర్నాకు దిగింది.
తమిళనాడు : ప్రేమ పేరుతో నమ్మించి పెళ్ళికి నిరాకరించిన ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన తమిళనాడులోని చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరువల్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొట్టయూర్ గ్రామానికి చెందిన పార్థసారధి కుమార్తె తులసీ (29), తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులు. అయితే తులసి అదే ప్రాంతానికి చెందిన తన మామ బాలకృష్ణ కుమారుడు సతీష్ కుమార్ తో ఏళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి రెండు నెలల నుంచి సతీష్ కుమార్ ను కోరుతోంది.
అడిగిన ప్రతిసారి ఆ యువకుడు వివిధ కారణాలు చెబుతూ వచ్చాడు. ఆమె ఒత్తిడి చేయడంతో తన వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని తీసుకువస్తే ఇద్దరం సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. ఈ నెల 4న యువతి తల్లిదండ్రులు యువకుడు ఇంటికి వెళ్లి యువతిని పెళ్లి చేసుకోవాలని కోరారు. దీనికి యువకుడి తల్లిదండ్రులు నిరాకరించారు. 50 సవర్ల బంగారు నగలు, కారు కట్నం ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటారా అని తేల్చి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన తనకు జరిగిన అన్యాయంపై తిరువల్లూరు కలెక్టర్ ఆల్బీ. జాన్ వర్గీయ, ఎస్పీ ఫకెర్లా సెఫాస్ కల్యాణ్, తిరువల్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రావద్దు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
అయినా న్యాయం జరగక పోవడంతో గురువారం ఉదయం యువకుడు ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న మప్పేడు శక్తి వేలు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించింది. కాగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామంలో సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు పరారయ్యారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే ఓ బాలికను కాటేశారు. వావివరుసలు మరచి, మృగాల్లా ప్రవర్తించి సొంత కూతురిపైనే పలు సందర్భాల్లో అఘాయిత్యం చేసి, ఆమె జీవితాన్ని నాశనం చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి ప్రస్తుతం పూణేలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పూణేలో ప్రస్తుతం బాలిక చదువుతున్న కాలేజీలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు ఆమె హాజరయ్యింది. అక్కడ ఆమె త గోడు వినిపించడంతో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి.
బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూణే పోలీస్ స్టేషన్లో బుధవారం నిందితుల పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, ఆమె తండ్రిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 2016, 2018 సంవత్సరాల్లో తాను యూపీ లో ఉన్న సమయంలో తన అంకుల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తన తాతయ్య కూడా వేధింపులకు గురి చేసేవాడని బాలిక వాపోయింది. 2018లో పూణే వచ్చాక ఈ లైంగిక దాడి ఘటన గురించి తన తండ్రికి చెప్పుకోలేక.. ఓ చీటీలో రాసి ఇచ్చానని చెప్పింది.
అయితే, అది చదివిన తండ్రి.. తనను హింసించే వారిపై చర్యలు తీసుకుని.. తనకు ఓదార్పును, రక్షణను ఇవ్వడానికి బదులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో తనపై పలు సందర్భాల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాలిక తండ్రి తో పాటు ఆమె అంకుల్, తాతయ్యలపైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
