పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ, ఆరుగురి మృతి.. యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి..
ఓ లారీ అదుపుతప్పి పాదచారులమీదికి దూసుకెళ్లి నేరుగా కాలువలో పడింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ : లఖింపుర్ ఖేరీ… నిరసన తెలుపుతున్న రైతుల మీదికి జీపులను తోలి వారి మరణాలకి కారణమైన ఘటనతో ఉత్తర ప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తాజాగా ఓ లారీ పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచింది. లఖింపుర్ ఖేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెడితే…
వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న పాదచారుల పైకి దూసుకుపోయింది. దీంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందిస్తున్నారు. అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లకింపూర్ ఖేరి జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి ముందు జరిగిన ఓ చిన్న ఘటన ఆరుగురి ప్రాణాలకు ముప్పు తీసుకువచ్చిందని తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ లో 12 గ్రామాల్లో నీటి కాలుష్యం.. కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత...
శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో పంగి ఖుర్ద్ గ్రామ సమీపంలోని పిలిభిత్ బస్తీ రోడ్డు మీద ఓ కారు ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి గాయపడ్డాడు. ఈ ప్రమాద ఘటన తెలియడంతో స్థానికులు అక్కడ చుట్టూ గుమిగూడారు. సరిగ్గా అదే సమయంలో బహ్రాయిచ్ నుంచి వేగంగా వస్తున్న లారీ ప్రజల మీదికి దూసుకు వెళ్ళింది. దూసుకు వెళ్లి నేరుగా కాలువలో పడిపోయింది. కాకా ఈ ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.