Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌ ప్రదేశ్ లో 12 గ్రామాల్లో నీటి కాలుష్యం.. కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత...

హిమాచల్ ప్రదేశ్‌లో నీటి కాలుష్యం కంగారుపెడుతోంది. కలుషిత నీటి సరఫరాతో దాదాపు అక్కడి 12 గ్రామాల్లోని 535మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. 

Water pollution in Himachal Pradesh, 535 people fell ill after drinking contaminated water - bsb
Author
First Published Jan 30, 2023, 6:48 AM IST

హిమాచల్ ప్రదేశ్‌ : హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఓ దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. అక్కడి నదౌన్ సబ్ డివిజన్‌లోని డజను గ్రామాల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఆదివారం నాటికి 535కి చేరుకుంది. బాన్, జంద్గీ గుజ్రాన్, జందలి రాజ్‌పుతాన్, పన్యాలా, పథియాలు, నియతి, రంగస్ చౌకీ హార్, థాయిన్, శంకర్‌తో సహా డజను గ్రామాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడ్డారు.

అస్వస్థతకు గురైన వారి సంఖ్య 300 దాటిందని రంగస్ పంచాయతీ అధిపతి రాజీవ్ కుమార్ అంతకుముందు రోజు చెప్పారు. కొంతమంది రోగులను హమీర్‌పూర్‌లోని ఆసుపత్రులకు రిఫర్ చేశారు.జలశక్తి శాఖ అందించే కలుషిత నీరు తాగి ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

నీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్యానికి కారణమవుతుందని కుమార్ చెప్పారు. నీటి సరఫరా చేసే పిట్ కలుషితం కావడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. నిర్మాణంలో ఉన్న ట్యాంకు నుంచి నీటిని ఫిల్టర్ చేయకుండానే సరఫరా చేయడం వల్ల వ్యాధి ప్రబలిందని గ్రామస్తులు తెలిపారు.

ప్రజల దృష్టి మళ్లించడానికే .. : మొఘల్‌ గార్డెన్‌ పేరు మార్పుపై ప్రతిపక్షాల ఫైర్..

నౌదాన్ నుండి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, రోగులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు, ఇతర వస్తువుల కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా పరిపాలన, ఆరోగ్య శాఖను ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఏజెన్సీల నుంచి పూర్తి నివేదికను కూడా కోరారు.

చీఫ్ మెడికల్ ఆఫీసర్ (హమీర్‌పూర్) డాక్టర్ ఆర్‌కె అగ్నిహోత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ బృందాలు బాధిత గ్రామాలకు చేరుకున్నాయి. జలశక్తి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బాధిత గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేసి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపారు.

సరఫరా నిలిపివేసిన తర్వాత ప్రజలకు బాటిల్ వాటర్ పంపిణీ చేస్తున్నారని ఆ శాఖ జూనియర్ ఇంజనీర్ తెలిపారు. గ్రామాల్లో వైద్యులు, ఆరోగ్య, ఆశా వర్కర్ల ద్వారా నిత్యావసర మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ దేబశ్వేత బానిక్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios